కమలానికి కాలం కలసిరావడం లేదే

కర్ణాటకలో కమలం పార్టీకి పెద్దగా ఏదీ కలసి రావడంలేదు. ప్రచారం దగ్గర నుంచి అన్నీ అవరాధాలే.. తప్పటడుగులే. మరోవైపు సిద్ధరామయ్య కొడుతున్న సిక్సర్ల దెబ్బకు కమలనాధులు భారీ స్కోర్ దిశగా ప్రయత్నం చేయాల్సి ఉంటుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు. లేకుంటే బీజేపీ డకౌట్ కాక తప్పదన్న వాదనలూ విన్పిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక నేతలు మరింత స్పీడ్ ను పెంచారు. ముఖ్యంగా అమిత్ షా కర్ణాటకలో కలియ దిరుగుతున్నారు. అనేక మఠాలను సందర్శించారు. మైసూర్ మహారాజా ప్యాలెస్ కు వెళ్లి రాజమాతతో సంప్రదింపులు జరిపారు.

మఠాలకు వెళ్లి మరీ….

అయితే మఠాలకు వెళ్లినప్పుడు అమిత్ షాకు చేదు అనుభవమే ఎదురయింది. లింగాయత్ మఠాలకు వెళ్లినప్పుడు పీఠాధిపతులు కూడా తమను ప్రత్యేక మతంగా గుర్తించాలని వినతి పత్రం ఇవ్వడంతో అమిత్ షా కంగుతినాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కార్ ఆమోదం తెలిపింది. దీన్ని కేంద్రానికి పంపింది. ఇప్పుడు కేంద్రం చేతిలోనే ఆ నిర్ణయం ఆధారపడి ఉండటంతో బీజేపీపై వత్తిడి పెరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న యడ్యూరప్పది కూడా అదే సామాజిక వర్గం కావడంతో ఆయన కూడా ఇరకాటంలో పడ్డట్లయింది.

ఇప్పుడు కాదంటున్న….

కాని బీజేపీ మాత్రం కాంగ్రెస్ జిమ్మిక్కులకు తాము ఒగ్గేది లేదని చెబుతోంది. ముఖ్యమైన అంశంగా మారిన లింగాయత్ ల విషయంలో ఎన్నికల తర్వాతనే తమ నిర్ణాయాన్ని ప్రకటిస్తామని బీజేపీ నేతలు లింగాయత్ ల వద్ద తంటాలు పడుతూ చెబుతున్నారు. కర్ణాటకలో 17 శాతం ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ లు గత కొన్నాళ్లుగా బీజేపీతోనే కలసి నడుస్తున్నారు. అందుకోసమే యడ్యూరప్పను కమలం పార్టీ రంగంలోకి దించింది. కాని సిద్ధూ వేసిన బాణంతో కమలం విలవిలలాడి పోతంది. తాము ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాలో తమకు తెలుసునంటున్నారు కమలనాధులు.

నైట్ మీటింగ్ లు పెట్టి…..

మరోవైపు లింగాయత్ ల ఓటు బ్యాంకును చీల్చేందుకే సిద్ధరామయ్య ఈ ఎత్తుగడ వేసినట్లు భావించిన కమలనాధులు లింగాయత్ లతో నైట్ మీటింగ్ లు మొదలుపెట్టేశారు. తమకు సహకరించాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే లింగాయత్ లను ప్రత్యేకమతంగా గుర్తిస్తూ కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అగ్రనేతల చేత చెప్పిస్తున్నారు. లింగాయత్ ఓట్లలో చీలిక వస్తే ఓటమి తప్పదని భావించిన బీజేపీ అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తుంది. మొత్తం మీద ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు ఒక ఎత్తయితే…కర్ణాటక ఎన్నికలు మరొకఎత్తుగా అమిత్ షా భావిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 23866 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*