
కాంగ్రెస్ కు వరుస విజయాలు వస్తుండగా, బీజేపీకి మాత్రం పరాజయాల పరంపర కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లోని ముంగౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ బీజేపీ అభ్యర్థి భాయ్ సాహెబ్ పై రెండు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలి రౌండు నుంచే కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతూ వచ్చింది. కొలారస్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఈ రెండు నియోజకవర్గాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద బీజేపీకి మధ్యప్రదేశ్ లోనూ ఎదురుగాలి వీస్తుందన్న సంగతి స్పష్టమైంది. ఈ ఏడాది మధ్యప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ రిజల్ట్ ఇక్కడ కూడా రిపీట్ కావడం కమలనాధులకు ఆందోళన కలిగిస్తోంది.
Leave a Reply