కుంతియాకు కౌంట్ డౌన్ స్టార్టయిందా?

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ తెలంగాణ పై కూడా దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంత చేసినా కష్టమేనన్నది తెలిసి, తెలంగాణలో అధికారాన్ని ఈసారి కైవసం చేసుకోవాలన్నది కాంగ్రెస్ ప్లాన్. అన్ని కష్టాలకు ఓర్చి, పార్టీ ఒక రాష్ట్రంలో పట్టు కోల్పోతుందని తెలిసి తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాకపోవడం నేతల తప్పిదమేనన్నది అధిష్టానానికీ తెలియంది కాదు. ఇక్కడ మూడు గ్రూపులు….ఆరు జట్లుగా నేతలు వర్థిల్లుతున్నారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడమే కాదు ఓడించడానికి కూడా కృషి చేస్తున్న నేతలు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గత ఎన్నికల్లోనే ఇలాంటి ఫిర్యాదులు అనేకం టెన్ జన్ పథ్ కు అందాయి.

కుంతియాకు సమర్థత లేదని…

అయితే ప్ర్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్న కుంతియా అందుకు సరిపోడన్నది అధిష్టానానికి తెలియంది కాదు. నాడు దిగ్విజయ్ సింగ్ ను ఆకస్మికంగా తొలగించాల్సి రావడంతో రాహుల్ వెనువెంటనే తాత్కాలికంగా కుంతియాకు తెలంగాణ పార్టీ బాధ్యతలను అప్పగించారు. కుంతియా కూడా తాత్కాలిక ఇన్ ఛార్జి మాదిరిగానే వ్యవహరిస్తున్నారు. ఎవరినీ కమాండ్ చేసే శక్తి కుంతియాకు లేదన్న సంగతి అందిరికీ తెలిసిందే. తాను పూర్తి కాలం ఇన్ ఛార్జిగా ఉంటానని కుంతియా చెబుతున్నప్పటికీ ఆయన మార్పు తథ్యమని ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

అలా అయితే ఓకే….

కుంతియా అందరినీకలుపుకుని పోతున్నారు. అందరూ కావాలనుకుంటున్నారు. కుంతియా ఇన్ ఛార్జి పదవి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ లో చేరికలు కూడా పెరిగాయి. నాగం, రేవంత్ లాంటి నేతలు కండువా కప్పుకోవడానికి ప్రధాన కారణం కుంతియా తీసుకున్న చొరవేనన్నది గాంధీభవన్ వర్గాల టాక్. అయితే గ్రూపు విభేదాలను మాత్రం కుంతియా అరికట్టలేకపోతున్నారు. ఎవరు ఏది చెప్పినా తలాడించడమే కుంతియా పని. ఇప్పటికే నాగం చేరికతో మహబూబ్ నగర్ జిల్లా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాగం చేరికకు వ్యతిరేకంగా మీడియా సమావేశాలు పెట్టే పరిస్థితి తలెత్తింది.

కంట్రోలో చేయగలిగిన నేతలను….

నేతలను కట్టడి చేయడానికి అధిష్టానం కుంతియాను తప్పించాలని భావిస్తోంది. కమాండ్ చేయగలిగన నేతలను త్వరలోనే ఇన్ ఛార్జిగా నియమించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రధానంగా గతంలో ఇక్కడ పార్టీ ఇన్ ఛార్జిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, సుశీల్ కుమార్ షిండే పేర్లను పరిశీలస్తున్నట్లు సమాచారం. గులాం నబీ ఆజాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఇన్ ఛార్జిగా పనిచేశఆరు. అలాగే నేతలను కంట్రోల్ పెట్టడం ఆజాద్ కు వెన్నతో పెట్టిన విద్య. ఇక జైరాం రమేష్ పేరు కూడా వినపడుతుంది. రాష్ట్ర విభజన సమయంలో కీలకంగా పనిచేసిన జైరాం రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉంది. షిండే పేరు విన్పిస్తున్నా ఆయన వయసు రీత్యా ఇక్కడకు పంపక పోవచ్చన్న వాదన కూడా విన్పిస్తోంది. కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జిని ఖచ్చితంగా మారుస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సో…కుంతియాకు ..కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్లే….!

Ravi Batchali
About Ravi Batchali 21652 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*