కేశినేని నాని కఠిన నిర్ణయం

కేశినేని నాని

కేశినేని ట్రావెల్స్ ను మూసేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. కార్యాలయాన్ని రాత్రి మూసేశారు. ఇక కేశినేని ట్రావెల్స్ బస్సులు తిరగవని అధికారికంగా ప్రకటించారు. కేశినేని ట్రావెల్స్ దశాబ్దకాలంగా తిరుగుతున్నాయి. అంతరాష్ట్ర బస్సులను కూడా నడుపుతున్న కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 450కి పైగా ఉన్న బస్సులను ఇక తిప్పబోమని ప్రకటించారు. అప్పుల ఊబిలో చిక్కుకున్నందునే మూసివేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలోని కేశినేని ప్రధాన ట్రావెల్స్ బోర్డును కూడా తొలగించారు.

ట్రావెల్స్ మూసివేస్తూ….
కేశినేని నాని ఇటీవల ఆర్టీఏ ఆఫీస్ లో అధికారులపై దాడికి దిగిన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నానితో పాటుగా మిగిలిన నేతలను పిలిచి క్లాస్ పీకారు. అధికారులకు క్షమాపణ చెప్పాల్సిందేననడంతో విధిలేని పరిస్థితుల్లో నాని క్షమాపణ చెప్పారు. అప్పటి నుంచి చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్న నాని కేశినేని ట్రావెల్స్ ను మూసివేయాలని నిర్ణ‍యం తీసుకున్నారు. ట్రావెల్స్ లో పనిచేస్తున్న దాదాపు 400 మంది సిబ్బందిని పంపించి వేశారు. దాదాపు యాభై ఏళ్ల నుంచి నడుస్తున్న కేశినేని ట్రావెల్స్ ను మూసివేయడం సంచలనానికి దారి తీసింది. ఆర్టీఏ అధికారులు అవలంబిస్తున్న తీరుపైనే నాని ఆగ్రహంతో మూసివేశారని చెబుతున్నారు. చంద్రబాబు నానికి మూసివేయ వద్దని చెప్పినా చివరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులను అమ్మివేస్తామని కేశినేని చెబుుతున్నారు. మొత్తం మీద కేశినేని తన అసంతృప్తిని ఈ విధంగా బయటపడ్డారని తెలిసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*