గుజరాత్ ఎన్నికల్లో గెలుపెవరిది?

indian national congress in madhyapradesh, rajasthan

దేశంలో ఏ ఎన్నికలకు లేని వత్తిడిని తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ , కమలదళపతి అమిత్ షా లు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ కోటకు కాబోయే రాజు ప్రస్తుత యువరాజు రాహుల్ కి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా బిజెపి గుజరాత్ ఎన్నికల యుద్ధానికి సర్వశక్తులు ఒడ్డి పోరాటానికి సంకల్పించింది. ప్రధాని మోడీ ఇప్పటికే 11 వేలకోట్ల రూపాయలను వివిధ అభివృద్ధి పనులకోసం గుజరాత్ కి కేటాయించారు. అలాగే అరడజను సార్లు తన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మించిన కార్యక్రమాలు చేపట్టారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇలా ప్రధాని తన స్థాయిని మరిచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి దిగి మరి అన్ని తానై వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్ కూడా అంతే …

గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నిక అయ్యే సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు మోడీ అమిత్ షా ద్వయం చుక్కలు చూపించింది. చివరికి అహ్మద్ విజయం ఆఖరి ఓటుతో ఖరారు కావడం తో హస్తం పార్టీ కమలం పై పగపట్టింది. తమ ఎమ్యెల్యేలకు ప్రలోభాలకు గురిచేసి తమను అష్టకష్టాలకి లోను చేసిన మోడీ సర్కార్ కి గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్ పక్కా వ్యూహంతో అధికారపార్టీతో సమానంగా ఎన్నికల ప్రచారాన్ని ముందే దంచేసింది. రాహుల్ గాంధీ సారధ్యంలో గుజరాత్ ఎన్నికల క్యాంపైన్ హోరెత్తిపోతుంది. ఇలా ఇరు పార్టీలు నువ్వా నేనా అని తలపడుతున్న ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

నోట్ల రద్దు , జీఎస్టీపై భయపడుతున్న బిజెపి …

గుజరాత్ లో వ్యాపారవర్గాలు అధికసంఖ్యలో వున్నాయి . వారంతా నోట్ల రద్దు , జీఎస్టీ ప్రభావంతో విల విల్లాడారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు కేవలం నోట్ల రద్దు మాత్రమే జరిగింది. అప్పుడు అఖిలేష్ సర్కార్ పై వ్యతిరేకత, విపక్షాల అనైక్యత కలిసొచ్చి బంపర్ విక్టరీ కొట్టింది బిజెపి. ఇప్పుడు గుజరాత్ లో సీన్ అలా లేదు. నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమలు ప్రభావం ఈ ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుంది. అందువల్ల తమ విజయంపై కమలంలో అనుమానాలు రేకెత్తే పరిస్థితి ఎన్నడూ లేనివిధంగా ఎదురైంది. రాబోయే ఎన్నికల్లో బిజెపిని సమరోత్సహంతో ముందుకు సాగించాలంటే మోడీ సొంత గడ్డపై విజయం ఆయనకు అత్యవసరం. ఈ నేపథ్యంలో మోడీ, షా ల ద్వయం ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి.

బీజేపీకే పట్టం కట్టిన ఇండియా టుడే సర్వే….

బిజెపి గుజరాత్ లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 115 నుంచి 124 స్థానాలు గెలుచుకుంటుంది అని ఇండియా టుడే సర్వే అభిప్రాయపడింది . వాస్తవానికి ఈ సర్వే చేసిన ఇండియా టుడే బిజెపి బాకా మీడియా కాకపోవడం విశేషం. దాంతో సర్వత్రా ఇండియా టుడే సర్వే పై చర్చ సాగుతుంది. బిజెపి శ్రేణుల్లో ఉత్సహం పెల్లుబికుతుంది . మరో వైపు ఇది ఎన్నికల ముందు చేసిన సర్వే అని డిసెంబర్ 9 పోలింగ్ నాటికి పరిస్థితులు బిజెపికి అంత అనుకూలంగా ఏమీ ఉండవని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ నోటిఫికేషన్ తో పాటు రావాలిసిన నోటిఫికేషన్ గుజరాత్ వరదలను సాకుగా చూపి ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడం కోర్టుకు పోతాం అంటూ కాంగ్రెస్ ఇచ్చిన వార్నింగ్ ప్రభావంతో ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో దేశవాసుల చూపు గుజరాత్ పై పడింది. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వే లు ఇప్పుడు మరింత ఆసక్తి ని చర్చలను రేపుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 41248 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*