
గుజరాత్ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయన తన సొంత రాష్ట్రంపై క్షణం తీరిక లేకుండా దృష్టి పెడుతున్నారనడానికి హైదరాబాద్ టూర్ ఇంకా ఫైనల్ కాకపోవడాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఈనెల 28 న ప్రధానమంత్రి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రారంభానికి రావాలిసి వుంది. అతి తక్కువ సమయం వున్నా ఇప్పటివరకు పిఎంఓ నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి ప్రధాని వస్తారా రారా అన్నది ఇంకా తేలలేదు. ఇదే ఇప్పుడు టి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ లకు టెన్షన్ కి గురి చేస్తుంది. ఇప్పటికే తీవ్ర ఆలస్యం అయిన మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభం మరింత ఆలస్యం అయితే టిఆర్ఎస్ పరువు పోతుంది అని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ప్రధాని ఎలాగైనా వచ్చేలా పిఎంఓ పై వత్తిడి తెస్తుంది టి సర్కార్.
గ్లోబల్ సమ్మిట్ కి ఒకే ….
ప్రధాని మోడీ గ్లోబల్ సమ్మిట్ కి హాజరు అవుతాన్నది పిఎంఓ స్పష్టం చేసింది. మెట్రో కార్యక్రమానికి మాత్రం మోడీ ఇంకా సంతకం చేయలేదు. ఇప్పటికే ప్రధాని కోసం మియాపూర్ లో హెలిప్యాడ్ సైతం ప్రత్యేకంగా తయారు చేశారు. నిన్న మొన్నటి వరకు మెట్రో ప్రాజెక్ట్ భద్రతా అనుమతులు లేక ప్రారంభం సందిగ్ధంలో పడింది. వాటికి గ్రీన్ సిగ్నల్ పడింది అని ఊపిరి పీల్చుకుంటే ఇప్పుడు ప్రధాని మెట్రో ఓపెనింగ్ సందేహంగా మారింది. ప్రధాని మెట్రో ప్రారంభానికి రాని పక్షంలో ఏమి చేయాలా అన్న మీమాంసలో టి సర్కార్ ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతుంది.
Leave a Reply