గొట్టిపాటి, కరణం వార్ మళ్లీ మొదలయింది

ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య విభేదాలు సద్దుమణిగినట్లు కన్పించడం లేదు. తాజాగా ఒక సీసీ రోడ్డు శంకుస్థాపన కు ఇద్దరూ పోటాపోటీగా శిలాఫలకాలను ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత దారితీసే అవకాశముండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య విభేదాలు ఇటీవల తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హత్యలు కూడా ఇటీవల చోటు చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రెండు వర్గాలకూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఒంగోలులో జరిగిన మినీ మహానాడులో కూడా గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గీయులు బాహాబాహీకి తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఎవరిపైనా ఎటువంటి చర్యలకు అధిష్టానం తీసుకునేందుకు ముందుకు రాలేదు. మంత్రుల కమిటీ నివేదిక సమర్పించినా ఎవరిపైనా చర్యలు ఇంతవరకూ లేవు. దీంతో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు ఇంకా నడుస్తూనే ఉంది.

సీసీ రోడ్డు శంకుస్థాపన విషయంలో…..

తాజాగా అద్దంకిలో సీసీ రోడ్ల శంకుస్థాపన వివాదంగా మారింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు సీసీ రోడ్డు శంకుస్థాపనకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డును ఎమ్మెల్యే చేతనే శంకుస్థాపన చేయించాలని గొట్టిపాటి వర్గీయులు పట్టుబడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ అయిన కరణం బలరాం వర్గీయులు కూడా బలరాం చేతనే శంకుస్థాపన చేయించాలని భావించి ఆయన పేరిట కూడా మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సీసీ రోడ్డు శంకుస్థాపన మరోసారి రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశముందని భావించిన పోలీసులు పెద్దయెత్తున బలగాలను దించారు. దీనిపై పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అద్దంకి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 29069 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*