చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు ధీమా ఇందుకేనా?

pawankalyan vs chandrababunaidu

తటస్థ ఓటర్లపై గురిపెట్టాలన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షను తెలుగు తమ్ముళ్లు నెరవేర్చేటట్లు లేరు. వచ్చే ఎన్నికల్లో తటస్థ ఓటర్లే ప్రధాన భూమికను పోషించనున్నారని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ, బీజేపీ కూటమి, వైసీపీ, జనసేనల మధ్య పోటీ జరిగే అవకాశముంది. నియోజకవర్గాల పెంపుదల కూడా జరిగే అవకాశం లేదు. దీంతో 175 నియోజకవర్గాల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారనున్నారు. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తటస్థ ఓటర్లు విజయానికి తోడ్పాటునందించారని చంద్రబాబు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తటస్థ ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గంలో న్యూట్రల్ ఓటర్లను గుర్తించి వారి మనోభావాలకు అనుగుణంగా అక్కడి సమస్యలను తీర్చాలన్నది చంద్రబాబు భావన.

తటస్థ ఓటర్ల గుర్తింపు…….

గ్రామాల్లో ఇప్పటికే టీడీపీ, వైసీపీ వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కాని తటస్థ ఓటర్లు కూడా అంతే స్థాయిలో ఉన్నారు. వారిని కనిపెట్టి… వారి సమస్యలను గుర్తించేందుకు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని వినియోగించుకోవాలనుకున్నారు. పట్టణ ప్రాంతంలో టీడీపీకి బలంగా ఉందని చంద్రబాబు చేయించిన సర్వేల్లో తేలింది. దీంతో ప్రధానంగా గ్రామాల్లో తటస్థులకు పింఛన్, రేషన్ కార్డులు, బీమా కార్డులు వంటి వ్యక్తిగత సమస్యలను గుర్తించాలని చంద్రబాబు పార్టీ శ్రేణులను ఆదేశించారు. అలా గుర్తిస్తే వారి సమస్యలను తక్షణం పరిష్కరిచ గలిగితే వచ్చే ఎన్నికల్లోనూ విజయం ఖాయమన్నది ఆయన భావన. అయితే ఇందుకు భిన్నంగా తెలుగు తమ్ముళ్లు ప్రవర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తటస్థులను గుర్తించే కార్యక్రమాన్నే కొందరు తీసుకోలేదు. అయినా ఇంటింటికి వెళ్లి సమస్యలను అడుగుతున్నారు తప్ప… వారు ఏ పార్టీకి చెందని వారా? కాదా? అన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. ఈ విష‍యం తెలుసుకున్న చంద్రబాబు గుర్తించని వారందరినీ మరోసారి ఇంటింటికీ వెళ్లాలని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఆదేశించారని తెలిసింది. మొత్తం మీద చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో అనుసరిద్దామనుకున్న వ్యూహానికి తెలుగు తమ్ముళ్లు గండికొట్టేలా ఉన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 40485 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*