చంద్రబాబు చేతికి వైఎస్ జగన్ జుట్టు?

వైసీపీ అధినేత జగన్ తెలిసి చేశారో…తెలియక తొందరపాటు తనమో తెలియదు కాని ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైఎస్ జగన్ వీరలెవల్లో ఆందోళన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాల్లో యువభేరి పేరిట సభలు పెట్టి యువతను చైతన్యవంతుల్ని చేశారు కూడా. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి ఏ ఏ ప్రయోజనాలుంటాయో విడమర్చి చెప్పిన జగన్ అంతవరకూ ఆగుంటే బాగుండేది. అయితే శాసనసభ సమావేశాల సందర్భంగా ఆయన ఒక మాట నోరు జారారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని, ఒకవేళ ఇవ్వకుంటే వర్షాకాల సమావేశాల్లోనే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఏపీ ప్రజల సెంటిమెంట్ ను మరోసారి జగన్ వాడుకోవడానికే ఈ స్టేట్ మెంట్ ఇచ్పారన్నది ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఆ తర్వాత సీన్లు వరసగా మారాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రధాని మోడీని కలిసిన తర్వాత జగన్ గొంతు నుంచి ప్రత్యేక హోదా ఊసే లేదు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో మళ్లీ ఈ అంశంపైకి తెరమీదకు తెచ్చింది ఎవరో కాదు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబే.

జ‘గన్’ పేలలేదేంటబ్బా?

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఒక మాట అన్నారు. వైసీపీ ప్రాజెక్టులు అడ్డుకుంటుందున్న రొటీన్ డైలాగ్ తో పాటు ఆయన విసిరిన బాణం ఏంటంటే…. వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తామన్నారు కదా? ఏమైందని? విలేకర్లను ప్రశ్నించారు. వాస్తవానికి చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా మాట పక్కన పెట్టేశారు. ప్యాకేజీ తమకు నచ్చిందని, హోదా కంటే ఎక్కువ లాభాలు ప్యాకేజీ వల్ల ఉన్నాయని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. కాని ఉన్నట్లుండి జగన్ పార్టీ ఎంపీల రాజీనామాల వ్యవహారం సాక్షాత్తూ చంద్రబాబు నోటి నుంచి రావడంతో ఈ అంశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ నేతలు బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ప్రత్యేక హోదాపై రాజీనామాల విషయంలో వెనక్కు తగ్గారని చంద్రబాబు పరోక్షంగా చెప్పకనే చెప్పారన్న మాట. భవిష్యత్తులోనూ జగన్ మీద ఇదే అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించే అవకాశముందంటున్నారు. మాట తప్పను…మడమ తిప్పను అన్న జగన్ రాజీనామాల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గారో ఇప్పుడు టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తారు కూడా. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. మొత్తం మీద అనాలోచిత నిర్ణయాలు, తొందరపాటు ప్రకటనలు ఎలాంటి సమస్యలు తెచ్చిపడతాయో ఇప్పుడు జగన్ కు అర్థమయి ఉండొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 23857 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*