చంద్రబాబు తప్పులో కాలేసేశారా…?

shivsena comments on chandrababu

ఎన్నికల హీట్ ఎంత పని అయినా చేయిస్తుంది. అందులోను పదేళ్ళు అధికారానికి దూరమై చిక్కి శల్యమైన పార్టీ కి పూర్వ వైభవం కోసం అపార అనుభవజ్ఞుడు చంద్రబాబు తప్పులో కాలేసి ఇప్పుడు కోరి కష్టాలు నెత్తిన పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుని ఎడా పెడా హామీలిస్తూ పోతే ఎలాంటి ఉచ్చులు మెడకు బిగుసుకుంటాయో చంద్రబాబు ఉదంతమే ఉదాహరణగా నిలుస్తుంది. ఇది మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు గుణపాఠమే అవుతుంది. ఇంతకు బాబు చేసిన తప్పేమిటి ? ఇప్పుడు ఆయన పడుతున్న క్షోభ ఏమిటి అంటారా …?

కులాల కుంపట్లో వేలుపెట్టి ….

కులం, మతం, ప్రాంతం ఈ మూడు భావోద్వేగ ప్రేరిత అంశాలు. సరిగ్గా ఈ అంశాలతోనే రాజకీయనాయకులు ఆటలాడుకుని ఓట్లు పిండుకుంటారు. అదే రీతిలో 2014 ఎన్నికలముందు ఎన్నికల హామీగా బిసి ఎ కేటగిరిలో వున్న మత్య్సకారులను చంద్రబాబు ఎస్టీల్లో చేరుస్తా అంటూ హామీ ఇచ్చేశారు. హామీ మాత్రమే కాదు ఎన్నికల ప్రణాళికలో పెట్టి మరీ లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. దీనిపై వత్తిడి రావడంతో గత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి మత్సకారులను ఎస్టీల్లో పెట్టడం అన్న అంశం కేంద్రం పార్లమెంట్ లో చర్చించి రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలిసిన క్లిష్టమైన సమస్య. అది తెలిసినా బాబు ఓట్ల కోసం కులానికో ప్రామిస్ చేసి పారేశారు. ఇప్పుడు మత్సకారుల శ్రీకాకుళం లో తిరుగుబాటు మొదలు పెట్టారు. నాలుగేళ్లుగా చూస్తున్నాం ఏది మా రిజర్వేషన్ అంటూ వారు సాగిస్తున్న ఉద్యమానికి అన్ని వైపులా మద్దత్తు లభిస్తుంటే గిరిజనులనుంచి దాడులు మొదలు అయ్యాయి.

బాబు తలనొప్పి పవన్ తీరుస్తారా …?

టిడిపి ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ అన్న చర్చ మరోసారి మొదలైంది. పవన్ కళ్యాణ్ తన తదుపరి టూర్ శ్రీకాకుళం అని ప్రకటించడం ఇటీవలే ఆయన్ను మత్సకారుల బృందం కలవడం గమనిస్తున్న విశ్లేషకులు శ్రీకాకుళం మత్సకారుల ఉద్యమ వేడి చల్లార్చడానికి జనసేనాని నడుం బిగించారని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి వైసిపి నడుమ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడా మాత్రమే వుంది. శ్రీకాకుళం లో మత్సకారులు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వున్నారు. వీరిని ఎస్టీల్లో చేర్చే అంశం సాధ్యం అయ్యేది కాకపోవడంతో వైసిపికి ఈ ఓటు బ్యాంక్ టర్న్ అయ్యే అవకాశాలు వున్నాయి. ఇదంతా ఒక ఇబ్బంది అయితే… ఒక వేళ కేంద్రం వారిని అలా చేరిస్తే శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడు లేదా ఏపీ పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట రావు వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలో ఒకటి ఎస్టీ గా మారే అవకాశం జనాభా ప్రాతిపదికన ఏర్పడుతుంది. ఇది మరో రకమైన సమస్య. ఇప్పటికే నియోజకవర్గాలు పెంపు లేక కిందా మీదా పడుతున్న చంద్రబాబు ఇప్పుడు తాజా సమస్య నుంచి పవనే కాపాడతారని భావిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. మరి ఏమి జరగబోతుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30931 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*