చంద్రబాబు పూర్తిగా మారిపోయారే

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారా? పార్టీలో క్రమశిక్షణ తప్పిన వారిపై బాబు వేటు వేసేస్తారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇటీవల జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు ఈ విషయం చెప్పారట. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను ఇక ఉపేక్షించబోనని నేతలకు నిర్మొహమాటంగా చంద్రబాబు చెప్పారు. అయితే నేతలు మాత్రం ఈవిషయాన్ని లైట్ గా తీసుకున్నారు. ఎప్పుడూ చెప్పిందే…మరోసారి చెప్పారని భావించారు. కాని బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుపై వేటు వేయడంతో ఇక నోటిని అదుపులో పెట్టుకోవాలని అనుకుంటున్నారు టీడీపీ నేతలు. చంద్రబాబులో గత కొద్ది రోజులుగా మార్పు కనిపిస్తోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం ఒక కారణమై ఉండొచ్చు. ఆయన పాలనతో పాటు పార్టీపైన కూడా దృష్టి పెట్టారు. రోజుకు మూడు గంటలు పార్టీ కోసం చంద్రబాబు వెచ్చిస్తున్నారు.

వార్నింగ్ లు కాదు… ఊస్టింగ్ లే….

గత మూడేళ్ల నుంచి చంద్రబాబు వార్నింగ్ లు ఇవ్వడమే సరిపోయింది. హద్దు దాటిన నేతను మందలించడం, పార్టీకి వ్యతిరేకంగా మారిని పిలిచి సీరియస్ అవ్వడం మనం విన్నాం. ఎంపీ శివప్రసాద్, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, బోండా ఉమామహేశ్వరరావు వంటి నేతల విషయంలో ఇది స్పష్టమైంది. కేవలం వార్నింగ్ లే కదా? అని టీడీపీ నేతలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. అయితే గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చర్యలకు దిగుతున్నారు. తొలుత సీబీఐ సోదాలకు చిక్కిన టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిపై వేటు పడింది. తర్వాత తెలంగాణాలో భూకబ్జా కేసుల్లో అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును పదవి నుంచి తప్పించారు. ఈ సంకేతాలన్నీ ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందని చెప్పవచ్చు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో క్రమశిక్షణ అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే తీరా ఎన్నికల సమయానికి పార్టీ గాడి తప్పే ప్రమాదముందని గ్రహించిన చంద్రబాబు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను ఉపేక్షించబోనని చంద్రబాబు ఈ చర్యల ద్వారా పార్టీ శ్రేణులకు చేరవేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఇప్పుడు ఏపీ టీడీపీలో చంద్రబాబు మారిన వైఖరిపైనే చర్చ జరుగుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 19203 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*