
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లక తప్పదు. జయ అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఖరారు చేసింది. శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీం తీర్పు చెప్పడంతో శశికళ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. నిందితులను దోషిగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ తీర్పు చెప్పారు.
నాలుగు వారాల్లోపు నిందితులు లొంగిపోవాలని ఆదేశించింది. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్ కు కూడా శిక్ష పడింది. మరో న్యాయమూర్తి తీర్పు చెప్పాల్సి ఉంది. సీనియర్ న్యాయమూర్తి చంద్రఘోష్ జయలలితను కూడా దోషిగా నిర్ధారించారు. అయితే జయలలిత మరణించడంతో మిగిలిన ముగ్గురికి ఈ శిక్ష తప్పదు. మరో న్యాయమూర్తి తీర్పు చెప్పాల్సి ఉంది.
Leave a Reply