చిన్నమ్మ ప్రమాణస్వీకారం వాయిదా

శశికళ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పట్టాభిషేకం వాయిదా పడింది. ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో పట్టాభిషేకం డైలమాలో పడింది. గవర్నర్ విద్యాసాగరరావు న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వస్తారని తెలిసింది.

శశికళను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించవద్దంటూ సోమవారం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. దీంతోపాటుగా అక్రమాస్తుల కేసులో సుప్రీంకేసులో తీర్పు వారం రోజుల్లో రానుంది. ఈ కేసులో రెండో నిందితురాలిగా శశికళ ఉన్నారు. సుప్రీం తీర్పు వాయిదా తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుందా? లేక ఈలోపే గవర్నర్ చిన్నమ్మ చేత ప్రమాణస్వీకారం చేయిస్తారా? అన్నది ఈరోజు తేలనుంది. గతంలో కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగానే జయ ప్రమాణస్వీకారం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. కోర్టు తీర్పుకు, ప్రమాణస్వీకారానికి సంబంధం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. పూర్తి మెజారిటీ ఉన్న ఎమ్మెల్యేలు తన నేతను ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద చిన్నమ్మకు ఆరంభంలోనే అపశృతి ఎదురైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*