జగన్ అనుభవ లేమి ఇలా బయటపడిందా?

జగన్ అనుభవ రాహిత్యం బయట పడిందా? రాజకీయాల్లో అనుభవమే ముఖ్యమంటారు. జగన్ రెడ్డి రాజకీయ అనుభవ లేమి మరోసారి పార్టీని నవ్వుల పాలుచేసింది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై అవిశ్వాసం పెడతామని తొలుత ప్రకటించింది జగన్ మాత్రమే. ఇది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత జగన్ రూట్లో అధికార టీడీపీ కూడా రాక తప్పలేదు. ఇది జగన్ తన విజయంగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతు కూడగట్టడంలో జగన్ వైఫల్యం చెందారన్నది వాస్తవం. జగన్ కు అనుభవం లేకపోవడం వల్లనే ఈ తప్పిదం జరిగిందని చెప్పొచ్చు.

మద్దతు కూడగట్టేందుకు…

అవిశ్వాసానికి వ్యతిరేకంగా మద్దతును కూడగట్టాలని జగన్ రెడ్డి తన పార్టీ పార్లమెంటు సభ్యులను ఆదేశించారు. ఆయన కూడా స్వయంగా లేఖలు రాశారు. ఆ లేఖలన్నింటినీ పార్లమెంటులో ఉన్న ఆ పార్టీల లోక్ సభ పక్ష నేతలకు ఇవ్వాలని సూచించారు. దీంతో వెంటనే మద్దతు లభిస్తుందనుకున్నారు. కాని లోక్ సభలో ఉన్న పార్టీల పక్ష నేతలు హైకమాండ్ చెప్పినట్లే నడుచుకుంటారు. వారి పార్టీ అధ్యక్షుల సూచనలనే పాటిస్తారు. కాని జగన్ ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోయారు.

అధినేతలను కలవకుండా….

అందుకే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేశారు. తనను కలిసి ప్రయోజనం ఏంటని, అవిశ్వాసాన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడు తమ అధినేత్రి సోనియాగాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవాల్సిందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీల విషయంలో వైసీపీ ఇదే విధంగా చేసింది. దీంతో వైసీపీకి ఎక్కువ సంఖ్యలో పార్టీలు మద్దతివ్వలేకపోయాయి. తమ పార్టీ అధ్యక్షుల సూచనల మేరకే తాము పనిచేస్తామని, వారిని కలవాల్సిందని అనేక మందిని సూచించడంతో వైసీపీ ఎంపీలు దిక్కులు చూడాల్సి వచ్చింది.

చంద్రబాబు ఎలా చేశారు?

ఇక అనుభవజ్ఞుడైన చంద్రబాబు మాత్రం అన్ని పార్టీల అధినేతలతో మాట్లాడారు. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీ,  బహుజన్ సమాజ్ వంటి పార్టీల అధినేతలతో మాట్లాడి మద్దతు కూడగట్టగలిగారు. అవిశ్వాసంపై మద్దతును సంపాదించడంలో చంద్రబాబు విజయం సాధించారు. అవిశ్వాసం నెగ్గుతుందా? వీగుతుందా? అన్నది పక్కన పెడితే ఎవరి చెంత నిలిచారన్నది ముఖ్యమంటున్నారు. అలాగే ఇంత పెద్ద అంశం ఉన్నప్పుడు జగన్ కూడా పాదయాత్రకు విరామమిచ్చి ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల పెద్దలను స్వయంగా కలిసి మద్దతును కూడగడితే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Ravi Batchali
About Ravi Batchali 29191 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*