జగన్ ఇక రోజూ కోర్టుకు హాజరు కావాల్సిందేనా?

వైసీపీ అధినేత జగన్ ఇక రోజూ న్యాయస్థానానికి హాజరు కావాల్సిందేనా? అవుననే అంటున్నారు న్యాయనిపుణులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనపై వేసిన ఛార్జిషీట్లన్నింటినీ ఒకే సారి విచారించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ను జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్ ఉపసంహరించుకుంది.  అయితే కేసుల విచారణ ప్రక్రియ నడుస్తుండటంతో ఇలాంటి పిటిషన్ వేయడం సరికాదని సీబీఐ తరుపున న్యాయవాది గట్టిగా వాదించారు. దీంతో జగన్ వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. జగన్ పై మొత్తం 11 ఛార్జిషీట్లున్నాయి. వీటన్నింటి విచారణను ఇకరోజు వారీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతోజగన్ ఇక రోజూ కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అన్నీ ఛార్జిషీట్లపై ఒకేసారి కాకుండా విడివిడిగా అభియోగాలను నమోదు చేయనున్నారు. దీంతో తరచూ కోర్టుకు జగన్ తరచూ హాజరు కావాల్సి ఉంటుందంటున్నారు.

పాదయాత్రకు ఆటంకమా?

అయితే జగన్ అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ జగన్ పాదయాత్ర జరగనుంది. ఆరు నెలల పాటు ఏకబిగిన సాగే ఈ పాదయాత్రకు కేసులు అడ్డంకిగా మారతాయా? అన్న ఆందోళన వైసీపీ నేతల్లో ఉంది. 11 చార్జిషీట్ల మీద విడివిడిగా అభియోగాలు నమోదు చేయనుండటంతో ఎప్పుడు ఏ ఛార్జిషీటుకు సంబంధించి జగన్ హాజరు కావాల్సి వస్తుందోనని పార్టీ నేతలు కలత చెందుతున్నారు. ఇందుకోసం జగన్ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రకు అడ్డంకి కాకుండా న్యాయపరమైన చర్యలు ఏం  తీసుకోవాలోఆయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 23725 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*