
వైసీపీ అధినేత జగన్ పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామాన్ని సందర్శించండం ఆ పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దళితులకు మద్దతుగా రావద్దని పశ్చిమ గోదావరి జల్లా వైసీపీ నేతలు చెప్పినా వినకుండా జగన్ వచ్చారని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రు గ్రామాన్ని ఈరోజు జగన్ సందర్శించారు. అక్కడ గ్రామ బహిష్కరణకు గురైన దళితులను జగన్ పరామర్శించారు. అయితే జగన్ పర్యటన ఖరారు కాకముందు నుంచే పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ నేతలు ఇక్కడకు రావద్దని జగన్ కు సమాచారం పంపారు. ఇక్కడ పెద్దగా గొడవలేమీ లేవని, వస్తే మరింత ఉద్రిక్తత పెరిగే అవకాశముందని వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాకుండా అగ్రవర్ణాలన్నీ పార్టీకి దూరమవుతాయని కూడా జగన్ కు చెప్పారు. అయితే జగన్ మాత్రం వీటిని లెక్క చేయకుండా గగరపర్రు గ్రామాన్ని సందర్శించడంతో ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు జగన్ తీరుపై మండిపడుతున్నారు.
వైసీపీ నేతలపై వేటు వేయనున్నారా?
పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఎన్నికల్లో జగన్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. మొత్తం తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకుంది. దీంతో జగన్ ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంతకుముందు ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధితల కోసం, పోలవరం నిర్వాసితుల కోసం జగన్ అనేకసార్లు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చారు. ఆ జిల్లాలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో స్థానిక వైసీపీ నేతలు జగన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారు. దళితుల కోసం వస్తే అగ్రవర్ణాల ఓట్లు పోతాయని జగన్ ను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. కాని రాష్ట్రంలో అత్యధిక మంది దళితులు గత ఎన్నికల్లో వైసీపీ పక్షాన నిలిచారు. దీంతో జగన్ వైసీపీ నేతల మాటలను పట్టించుకోలేదు. జగన్ పర్యటనకు కూడా కొందరు వైసీపీ నేతలు దూరంగా ఉన్నారు. దీంతో జగన్ అతి సరికాదని, సమస్య వచ్చినప్పుడు కులాలకు అతీతంగా స్పందిచాల్సి ఉంటుందని నచ్చచెప్పటానికి ప్రయత్నించినా వారు విన్పించుకోక పోవడంతో కొందరిని వైసీపీ బాధ్యతల నుంచి తప్పించేందుకు జగన్ సిద్ధమయినట్లు సమాచారం. తనకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు, లోకల్ గా దళితులకు వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపట్టిన పార్టీ నేతలపై జగన్ వేటు వేయనున్నట్లు సమాచారం.
Leave a Reply