జగన్ తో పొత్తుకు పవన్ ను ప్రశాంత్ కిషోర్ ఒప్పింగచలరా?

పవన్ కల్యాణ్ ను జగన్ తో కలిపేందుకు ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా గెలిపించాలని ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధంచేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికతో పాటుగా పొత్తులపైన కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ప్రశాంత్ కిషోర్ దృష్టి పడింది. మాస్ ఇమేజ్ ఉన్న జగన్. సినీ గ్లామర్ ఉన్న పవన్ తోడైతే తమ్ముడూ…కుమ్ముడే..అన్నట్లు ఉంటుందన్నది వైసీపీ నేతల అభిప్రాయం కూడా. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్ వపన్ కల్యాణ్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. పవన్ అపాయింట్ మెంట్ తీసుకునేందుకు ఆయన కార్యాలయాన్ని కోరారు. అయితే పవన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున ప్రశాంత్ కిషోర్ కు నేటి వరకూ పవన్ అపాయింట్ మెంట్ ఖరారు కాలేదు. పవన్ అపాయింట్ మెంట్ లభిస్తే పవన్, జగన్ కలయికపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.

ఇద్దరి ఆలోచనలు…దారులు వేరు…..

అయితే పవన్ ఆలోచనలకు, జగన్ కార్యాచరణకు చాలా తేడా ఉంది. పవన్ కు ఇప్పటికిప్పుడే రాజకీయ అధికారాన్ని చేపట్టాలన్న యోచనలేదు. ఆయన పార్టీని కిందిస్థాయిలో పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిదానమే ప్రధానమన్నట్లు పవన్ వెళుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయమైనప్పటికీ ఆయన ప్రస్తుతానికి ఎవరితో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పవన్ పొత్తు పెట్టుకోదలిస్తే తన సిద్ధాంతాలకు చేరువగా ఉన్న లోక్ సత్తా, వామపక్షాల వంటి వాటితో పొత్తు పెట్టుకునే అవకాశముంటుంది. అంతేకాకుండా జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని ఉన్నారు. ఆయనతో పవన్ పొత్తు పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువేనని చెప్పాలి. పవన్ తో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ అధినేత జగన్ మాత్రం సిద్ధంగానే ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు జగన్ సానుకూలత వ్యక్తం చేయడంతోనే పవన్ అపాయింట్ మెంట్ కోసం ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ పవన్ ఏ మేరకు ప్రభావితం చేయగలరు? తన ఆలోచనలను పవన్ ముందుంచి ఆయనను కన్విన్స్ చేయగలరా? అన్నది ప్రశ్నార్థకరంగా మారింది.

Ravi Batchali
About Ravi Batchali 35875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*