జగన్ నవరత్నాలూ ముందుగానే ప్రకటించడనికి కారణాలేంటంటే?

వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు బాగానే ఉన్నాయి కాని రెండేళ్ల ముందుగానే వీటిని ప్రకటించడం వెనుక ఏమైఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వాస్తవానికి ఎన్నికలు ఇప్పట్లో లేవు. మ్యానిఫేస్టోలో పొందుపర్చాల్సిన అంశాలు ఇప్పుడే ప్రకటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒకటి, రెండు ప్లీనరీ లో ప్రకటించినా మేనిఫేస్టోను ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా ప్రకటిస్తుంది. ఇది సంప్రదాయంగా వస్తున్నదే. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం చాలా ముందుగానే తన ఎన్నికల మ్యానిఫేస్టోను ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. జగన్ ప్రజల కోసమే ఈ నవరత్నాలను ప్రకటించారని పైకి చెబుతున్నప్పటికీ వాస్తవానికి అది కాదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పుడో ఎన్నికలు ఉంటే ఇంత హడావిడిని జగన్ చేయడానికి క్యాడర్ ను నేతలను కాపాడుకోవడడం కోసమేనన్నది అసలు కారణంగా తెలుస్తోంది.

క్యాడర్, లీడర్లను కాపాడుకోవడానికే……..

గత మూడేళ్ల నుంచి అధికార తెలుగుదేశం పార్టీ సామ, ధాన,బేధ, దండపాయ ప్రయోగాలతో ఇప్పటికే వైసీపీ క్యాడర్ కొంత చెల్లా చెదురైంది. నేతలే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. క్యాడర్ కూడా అయోమయంలో పడింది. వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి వస్తామా? రామా? అన్న సందేహం పార్టీ క్యాడర్ లో నెలకొని ఉంది. పూర్తి నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్ కు, లీడర్లకు నూతనోత్తేజం కల్పించడం కోసమే జనగ్ ప్లీనరీలో ఈ భారీ మేనిఫేస్టోను ప్రకటించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయినా ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు ఇంకా వైసీపీని నమ్ముకునే ఉన్నారు. వెళ్లిపోయిన లీడర్ల నుంచి వారికి వత్తిడి ఎదురవుతోంది. దీంతో వారు పార్టీని వీడాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్నారు. ఈనేపథ్యంలో క్యాడర్ లో జోష్ నింపేందుకే జగన్ మేనిఫేస్టోను ముందుగానే ప్రకటించారని సమాచారం. క్షేత్రస్థాయిలో ఏపీలో బలంగా ఉన్న వైసీపీ బలహీన పడంగా ఉండేందుకే జగన్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. మొత్తం మీద జగన్ విడుదల చేసిన మేనిఫేస్టో క్యాడర్ లో కొంత ఉత్సాహం నింపిందనే చెప్పాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 23725 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*