జగన్ ను మళ్లీ తొక్కేసేందుకు?

వైసీపీ అధినేత జగన్ పై ఎల్లోమీడియా మరోసారి ఆయన అధికారంలోకి రాకుండా ఉండేందుకు అడుగడుగునా అడ్డుపడుతోంది. జగన్ బీజేపీతో కలిసి పోతున్నారని నంద్యాల ఉప ఎన్నికల్లో విపరీతమైన ప్రచారం చేశారు. కేవలం ఆ నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాల ఓట్లను దూరం చేసేందుకు ఎన్నికల వేళ ఆ ప్రచారం చేసింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తాజాగా ఏపీలో జరుగుతున్న రాజీకీయ పరిణామాలతో మళ్లీ మరోసారి జగన్ పార్టీపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేవాల అవాస్తవ కథనాలను ప్రచురిస్తోందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

టీడీపీ తప్పుకుంటున్న తరుణంలో….

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చకచకామారిపోతున్నాయి. నాలుగేళ్ల నుంచి టీడీపీ, బీజేపీ బంధం సజావుగానే సాగింది. నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అక్కర్లదేన్నారు టీడీపీ నేతలు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నా ఒప్పుకున్నారు. అయితే అప్పటి నుంచి ప్రత్యేక ప్యాకేజీ నిధులు రావడం లేదని బయటకు చెప్పలేదు. బీజేపీ కూడా నిధులకు సంబంధించిన లెక్కలు అడగలేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలసి నడవడం మంచిది కాదనుకున్న చంద్రబాబు ఆ బంధాన్ని తెగదెంపులు చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుంచే నిధులు రాలేదంటూ టీడీపీ, లెక్కలు చెప్పడంలేదంటూ బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. త్వరలోనే ఈ రెండుపార్టీలు కటీఫ్ చెప్పుకోవడం ఖాయమనిపిస్తోంది.

బీజేపీతో చేతులు కలుపుతున్నారని….

ఈ సమయంలో బీజేపీతో జగన్ చేతులు కలుపుతున్నారని ఎల్లోమీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, జగన్ ను కలిపేందుకు ఇప్పటికే ఒక బడా వ్యాపారసంస్థతోపాటు కొందరు రాజకీయ నేతలు కూడా రంగంలోకి దిగి ప్రయత్నాలు చేస్తున్నారని కథనాలు వండి వార్చేస్తున్నాయి. టీడీపీతో పొత్తు తెగిపోయే పరిస్థితులున్నందున బీజేపీతో జగన్ జత కడతారన్నది ఆ కథనాల సారాంశం. అంతేకాదు బీజేపీ, వైసీపీ లు కలుస్తాయనడానికి చక్కటి ఉదాహరణలు కూడా చూపుతున్నారు. తాజాగా జగతి పబ్లికేషన్స్ కు చెందిన 34.6 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ల కేసులో ఈడీ అప్పిలేట్ అధారిటీ క్లీన్ చిట్ ఇవ్వడం ఇందుకు ఆధారంగా చూపుతూ ప్రత్యేక కథనాలు రాస్తున్నారు.

పై నుంచి ఆదేశాలు వచ్చాయట….

జగతిపబ్లికేషన్ సంస్థలో క్విడ్ ప్రోకో జరగలేదని ఈడీ అప్పిలేట్ అధారిటీ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వీరు తప్పుపడుతూ, దానికి కారణం మోడీయే నంటూ స్టోరీల మీద స్టోరీలు రాస్తున్నారు. జగన్ కేసుల్లో వేగం తగ్గించమని ‘‘పై’’ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కూడా ఆ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో కొంత అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో పొత్తుకు సాహసిస్తారా? ఏపీలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని అందరికీ తెలిసిందే. మరి ఆ విషయం జగన్ కు తెలియదా? తెలిసి తెలిసి ఎవరు చేయి కాల్చుకుంటారు. ఈ విషయంలో జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రత్యేక హోదా ఎవరిచ్చినా వారికి మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపారు. అది బీజేపీ కావచ్చు. కాంగ్రెస్ కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వ్యతిరేక మీడియా ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం పట్ల వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద జగన్ ను మరోసారి తొక్కేసేందుకు ఇప్పటి నుంచే కార్యక్రమం మొదలయిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 30023 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*