జగన్ లండన్ నుంచి వచ్చే లోపు ఏం జరగబోతోంది?

ramachandraiah comments on ncbn

.వైసీపీ అధినేత జగన్ లండన్ వెళ్లారు. ఆయన మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. ఈలోపే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారతారా? అన్న ఆందోళన ఆ పార్టీలో మొదలయింది. దాదాపు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత లేదని తెలుసుకున్న నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎవరు వెళతారు? ఎవరు పార్టీని నమ్ముకుని ఉంటారు? అన్న టెన్షన్ వైసీపీ రాష్ట్రస్థాయి నేతలను పట్టి పీడిస్తుంది. ప్రచారంలో వస్తున్న వారితో వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు. వారితోనేరుగా ఫోన్ చేసి జరుగుతున్న ప్రచారంపై ఆరా తీస్తున్నారు. అయితే ఎవరూ తాము పార్టీని వీడటం లేదనే చెబుతున్నారు. తాము ఎందుకు పార్టీని వీడతామని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. తాము వచ్చే ఎన్నికలలోనూ ఖచ్చితంగా గెలుస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. అయితే కొందరు మాత్రం దాట వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రచారాన్ని ఖండిస్తున్న ఎమ్మెల్యేలు…..

కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం గత కొద్దిరోజులుగా విపరీతంగా జరుగుతుంది. రఘురామిరెడ్డి గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అదే పార్టీ టిక్కెట్ పై గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కాని రఘురామిరెడ్డి మాత్రం జరుగుతున్న ప్రచారం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నమాట వాస్తవమే అయినా తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. కొందరు కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. వీరిలో వైసీపీ అధినేత జగన్ చుట్టాలు కూడా ఉన్నారని ఆయన సంచలన ప్రకటన చేయడం విశేషం. గతంలో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని రఘురామిరెడ్డి స్పీకర్ కు రాజీనామా లేఖ కూడా పంపారు. అలాగే రాయలసీమలోని మరికొందరి ఎమ్మెల్యేలు పేర్లు కూడా విన్పిస్తున్నాయి. కాని ఈ ప్రచారాన్ని వారందరూ ఖండిస్తున్నారు. కాని రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రాత్రికి రాత్రి పార్టీ మారిన వాళ్లూ లేకపోలేదు. మరి జగన్ లండన్ నుంచి వచ్చే లోపే పార్టీలో సంచలనాలు జరుగుతాయా? లేక పార్టీ మారతారని ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు తాము చెబుతున్నట్లు పార్టీకే కట్టుబడి ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 22439 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*