జగన్ సొంత ఇంటినే చక్కదిద్దు కోలేకపోతున్నారా?

వైసీపీ అధినేత జగన్ సొంత ఇంటినే చక్కదిద్దుకోలేక పోతున్నారా? ఆయన కుటుంబంలోనే కలతలు రేగాయా? కుటుంబంలో తలెత్తిన సమస్యలనే వైసీపీ అధినేత చక్క దిద్దుకోలేక పోతున్నారా? అవుననే అంటున్నారు కడప జిల్లాకు చెందిన నేతలు. కడప జిల్లాపై వైఎస్ కుటుంబానికి గట్టి పట్టుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే వైసీపీ నేతల వైఖరితో జగన్ చిన్నాన్న మనస్సు నొచ్చుకుందట. దీంతో ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేయాలని భావిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న జగన్ కుటుంబంలో రేగిన చిచ్చును ఆర్పేందుకు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు.

వైస్ ఛైర్మన్ తోనే సమస్య….

పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ గా జగన్ చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి భార్య సుశీలమ్మ ఉన్నారు. పులివెందుల మున్సిపాలిటీకే వారు పరిమితం. రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో కూడా ఆ కుటుంబం వేలు పెట్టదు. పులివెందుల మున్సిపాలిటీ పాలననే చూసుకుంటూ వస్తోంది. అయితే తాజాగా వైఎస్ కుటుంబానికి చెందిన వారు కొందరు సుశీలమ్మను డమ్మీని చేస్తూ పులివెందుల వైస్ ఛైర్మన్ చిన్నప్పకు అనధికారికంగా మున్సిపాలిటీ బాధ్యతలను చూసుకోమన్నారట. దీంతో చిన్నప్ప పెత్తనం ఎక్కువైంది. దీనికి మనస్తాపం చెందిన మనోహర్ రెడ్డి వైసీపీ పై మండిపడుతున్నారు. పార్టీని వీడి వెళ్లి పోతానంటూ తనసన్నిహితుల వద్ద కూడా చెప్పారట. దీన్ని అవకాశంగా చేసుకుని టీడీపీ నేతలు కొందరు మనోహర్ రెడ్డితో రాయబారాలు కూడా సాగించారు. ఇవన్నీ తెలియడం జగన్ కొంత ఆలస్యమయిందని చెబుతున్నారు.పులివెందుల్లో జరిగే విషయాన్ని తనకు ఎందుకు చెప్పలేదని కుటుంబ సభ్యులపై జగన్ మండిపడ్డారట. దీంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. గురువారం నుంచి జగన్ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన తన చిన్నాన్న మనోహర్ రెడ్డికి నచ్చచెప్పే  ప్రయత్నం చేయనున్నారట. అయితే ఇప్పటికే కొందరు పెద్దలు మనోహర్ రెడ్డికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారట.. మనోహర్ రెడ్డి కూడా తాను వైసీపీని వీడేది లేదని చెబుతున్నారు. పులివెందుల రాజకీయాలకే తాము పరిమితమయ్యామని, తన తండ్రి రాజారెడ్డి నుంచి తాము పులివెందుల అభివృద్ధి కోసమే పాటుపడుతున్నామని మనోహర్ రెడ్డి చెబుతున్నారు. జగన్ వెంటే తానుంటానని బయటకు చెబుతున్నా….లోపల మాత్రం లోకల్ వైసీపీ నేతల మీద మాత్రం మండిపడుతున్నారట. మొత్తం మీద వైసీపీ అధినేతకు సొంత జిల్లాల్లో సొంత ఊళ్లోనే…సొంత కుటుంబంలోనే తలనొప్పి వచ్చి పడింది. మరి జగన్ ఏం చేస్తారో చూద్దాం.

Ravi Batchali
About Ravi Batchali 26681 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*