జూన్ నెల జగన్ కు కష్టకాలమా?

ysrcongressparty in jammalamadugu constiuency

వైసీపీ అధినేత జగన్ కు కొత్త సమస్య వచ్చి పడింది. జూన్ నెల ఆయనకు కష్టంగానే మారనుంది. జూన్ నెలలో వైసీపీ పార్లమెంటు సభ్యులను రాజీనామా చేయిస్తానన్న జగన్ తన ప్రకటనకు కట్టుబడి ఉంటారా…? లేక మోడీతో భేటీ అయిన తర్వాత ఆ నిర్ణయం మార్చుకున్నారా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే జగన్ మోడీని కలిసి వచ్చిన తర్వాత ఎంపీల రాజీనామాల వ్యవహారంపై వెనకడుగు వేసినట్లు కన్పిస్తోంది. రాజీనామాలు చేస్తు పార్లమెంటులో ప్రత్యేక హోదాపై మాట్లాడేవారెవరని జగన్ ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో, రాజ్యసభలో గళం విప్పాలంటే వైసీపీ ఎంపీలు ఉండాల్సిందే కదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి జగన్ ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని పక్కన బెట్టినట్లే దాదాపుగా కన్పిస్తోంది.

ఎంపీల రాజీనామాల వ్యవహారం….

అయితే అధికార టీడీపీ మాత్రం దీనిపై ప్రజల్లో పెద్దయెత్తున తీసుకెళ్లాలని భావిస్తోంది. మహానాడు వేదికగా ఈ అంశాన్ని కూడా టీడీపీ నేతలు లేవనెత్త బోతున్నారు. జగన్ ఎందుకు యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చిందని మహానాడు వేదికగా ప్రశ్నించనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే జూన్ నెలలో తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తారని జగన్ స్వయంగా గతంలో అనేకసార్లు ప్రకటించారు. జూన్ మాసం దగ్గర పడుతుండటంతో ఈ అంశంపై నిలదీయాలని టీడీపీ భావిస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత జగన తన నిర్ణయాన్ని మార్చుకోవడంపై టీడీపీ ఎండగట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే చంద్రబాబు దీనిపై జగన్ ను ప్రశ్నించారు కూడా. అయితే జగన్ కూడా దీనిపై ప్రజలకు సమాధానం చెప్పడం కష్టమే. అందుకోసం టీడీపీ ఎంపీలతో కలసి ఏపీ లోని అందరం రాజీనామాలు చేయాలని జగన్ కొత్త పల్లవి అందుకునే అవకాశముందని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ మాత్రం ఎంపీల రాజీనామాల వ్యవహారాన్ని ప్రజల్లో పెద్దయెత్తున తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉంది. దీంతో జూన్ నెల జగన్ కు కష్టకాలమేనని పార్టీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 26901 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*