
వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రకాశం జిల్లా ముగించుకుని గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఇప్పటికే 1500 కిలోమీటర్ల పాదయాత్ర కంప్లీట్ అయ్యింది. ఇక రాజకీయంగా కీలకమైన గుంటూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు సహజంగానే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న వైసీపీ మూడు ఎంపీ సీట్లలో ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేదు. ఇక వైసీపీ గెలిచిన అసెంబ్లీ సీట్లలో మంగళగిరి కేవలం 12 ఓట్లతోనూ, గుంటూరు ఈస్ట్ సీట్లు 3 వేల మెజార్టీతో మాత్రమే గెలిచాయి.
పల్నాడులో మరీ ఘోరం…
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. పార్టీ ఓడిపోయిన చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లు పార్టీ బలోపేతం మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు. పల్నాడులో వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నరసారావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం, ఆయనకు కాస్త సానుకూల పవనాలు ఉండడంతో ఆ ఒక్క చోట మాత్రమే వైసీపీ స్ట్రాంగ్‌గా ఉంది. మాచర్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేక వాతావరణం ఉంది. ఈ సారి అక్కడ గెలుపు అంత సలువు కాదు. గురజాలలో నరసారావుపేటకు చెందిన మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డి ఇన్చార్జ్గా ఉన్నా ఆయన అక్కడ కంటే నరసారావుపేట నుంచే పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
అన్ని నియోజకవర్గాల్లోనూ…..
ఇక వినుకొండలో గత ఎన్నికల్లో పెదకూరపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొల్లా బ్రహ్మానాయుడు పార్టీని ముందుకు నడిపిస్తున్నా పార్టీ బలోపేతం అవ్వడం లేదు. పెదకూరపాడులో గుంటూరుకు చెందిన కావటి మనోహర్‌నాయుడు ఇన్చార్జ్గా ఉన్నా ఆయన స్ట్రాంగ్ పర్సన్ కాదన్నది పార్టీ వర్గాలే చెపుతున్నాయి. ఇక సత్తెనపల్లిలో గత ఎన్నికల్లో స్పీకర్ కోడెలపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన అంబటి రాంబాబు ఈ సారి గుంటూరు వెస్ట్ లేదా రేపల్లెలో పోటీ చేయాలనుకుంటున్నారు. చిలకలూరిపేటలో మర్రి రాజశేఖర్ అనారోగ్య కారణాలతో యాక్టివ్‌గా లేరు. ఇక ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు లాంటి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఘోరం.
గుంటూరు ఎంపీగా….
తెనాలిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్నాబత్తుని శివకుమార్‌ను పక్కన పెట్టస్తారంటున్నారు. గుంటూరు వెస్ట్‌లో లేళ్ల అప్పిరెడ్డిని పక్కన పెట్టడం ఖాయమైనట్టే. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నరేంద్రకు ఎంత వరకు పోటీ ఇస్తారన్నది చెప్పలేని పరిస్థితి. ఇక గుంటూరు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయులు పేరు ఖరారైంది. నరసారావుపేట ఎంపీగా గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డే పోటీ చేస్తారా ? లేదా మారుస్తారా ? అన్నది క్లారిటీ లేదు. ఏదేమైనా ఎన్నో సమస్యలతో వీక్‌గా ఉన్న గుంటూరు వైసీపీకి జగన్ పోస్టు మార్టం చేస్తాడని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి.
Leave a Reply