టిక్కెట్ల పై జనసేనలో క్లారిటీ లేదే ..?

జనసేన

కొత్త సీసాలో పాత సారా లా, పార్టీలు ఎన్ని వున్నా కొత్తవి పుట్టినా ఎప్పుడు వారే నాయకులా..? ఈ మూస విధానానికి చెక్ పెట్టి కొత్త వారితో ఎన్నికల్లోకి వస్తామని గతంలో పలు సందర్భాల్లో నొక్కి చెప్పిన జన సేన అధ్యక్షుడు ఇప్పుడు మాట తప్పేలాగే వున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన 40 శాతం పాతవారికి 60 శాతం కొత్త వారికి టికెట్లు ఇచ్చే ఫార్ములా తో పోటీ చేస్తుందని ఆ పార్టీ ప్రతినిధి హరిప్రసాద్ విజయవాడలో స్పష్టం చేయడం విశేషం. దీనిని బట్టి జనసేన నుంచి కొత్తదనం ఎక్కువగా ఆశించాలిసిన అవసరం లేదని విశ్లేషకులు తేలుస్తున్నారు. కొత్తవారికి అనుభవలేమి వల్ల ఎన్నికలు నిర్వహించేటప్పుడు పోల్, బూత్ మేనేజ్ మెంట్ సమస్యలతో సీట్లు తగ్గుతాయని కొందరు చేసిన హెచ్చరికలతో పవన్ అందరి బాటలోనే వెళ్ళనున్నారు.

కంటెంట్ రైటర్లు , స్పీకర్లు రెడీ ….

వినూత్న పంధాలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్న జనసేన పార్టీ సైన్యాన్ని కూడా వెరైటీ గా తయారు చేసుకుంటుంది. కంటెంట్ రైటర్లు , స్పీకర్లకు పరీక్షలు నిర్వహించి వారిని ఎంపిక చేసి ఆన్ లైన్ పోరాటాన్ని స్టార్ట్ చేయనుంది. దీనికోసం ఏడాది కాలంగా జనసేన సాగించిన కసరత్తు పూర్తి అయ్యింది .సైన్యం రెడీ అవ్వడంతో జనసేనాని సైతం ఇక పూర్తి స్థాయిలో పార్టీకి అందుబాటులోకి రానున్నారు. ఈనెల నుంచి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యక్రమాలకి తన పూర్తి సమయం కేటాయిస్తానని ముందే ప్రకటించారు.

జనసేన పై ఆశావహుల్లో ఆశలు….

పవన్ తొలుత చేసిన ప్రకటనతో యువ నేతల్లో ఉత్సహం పెల్లుబికింది. తరువాత వారసత్వ రాజకీయాలు తప్పేమి కాదని చేసిన సమర్దనతో కొందరు డీలా పడ్డారు . తాజాగా ఇప్పుడు 40 శాతం పాతవారు వుంటారనే సమాచారం రావడంతో చాలామంది నిరాశలో పడ్డారు . టికెట్ ఆశించి శ్రమ పడినతరువాత అధికార విపక్షాలనుంచి వచ్చే వారికి చివరిలో అగ్రతాంబూలం ఇస్తే అనే ఆలోచనలు జనసేన నుంచి ఎంట్రీ ఇద్దామనుకునే వారిని ఆలోచనలో పడేస్తున్నాయి .మరో వైపు అధికార విపక్షాలనుంచి టికెట్ ఆశించే వారికి జనసేన తాజా ప్రకటన తో లోలోపల ఆనందం వ్యక్తం చేస్తున్నారట . ప్రధాన పార్టీలు ఈక్వేషన్ లు , సర్వేలు అంటూ చివరినిమిషంలో హ్యాండ్ ఇచ్చినా జనసేనలోకి దర్జాగా పోవచ్చనే ధీమాలో వున్నారు .

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*