
ప్రకాశం జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మధ్య యుద్ధం ఆగేట్లు లేదు. అధినేత చంద్రబాబు చెప్పిన సూక్తులు పట్టించుకున్నట్లు లేదు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బలయ్యారు. బలరాం, గొట్టిపాటి వ్యక్తిగత కక్ష్యలు కార్యకర్తల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా బల్లికురవ మండలం వేమవరంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావుగా గుర్తించారు.
ఇద్దరు కార్యకర్తల మృతి….
వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ల మధ్య కొన్ని సంవత్సరాలుగా కక్ష్యలున్నాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారపార్టీలోకి గొట్టిపాటిని చేర్చుకోవద్దని కరణం అధినేత వద్ద మొరపెట్టుకున్నారు. కాని లోకేష్ మధ్యలో ఎంటరై గొట్టిపాటిని పార్టీలోకి చేర్చుకున్నారు. కరణం బలరాంను సంతృప్తి పర్చడానికి ఇటీవలే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత రెండు వర్గాల మధ్య కక్షలు మరింత పెరిగాయి. కలసి ఉండాలని చంద్రబాబు ఎంత చెబుతున్నా రెండు వర్గాలూ లైట్ గా తీసుకుంటున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు కరణం వర్గీయులు మృతి చెందడంతో అద్దంకి నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
Leave a Reply