తిరుపతిలో కేసీఆర్ స్వాగత పోస్టర్లు

తిరుమలలో కేసీఆర్ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఈరోజు సాయంత్రం తిరుమల చేరుకోనున్న కేసీఆర్ పద్మావతి గెస్ట్ హౌస్ లో బసచేస్తారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరనున్నారు. కేసీఆర్ వెంట ఆ‍యన కుటుంబ సభ్యులతో పాటు మంత్రివర్గ సహచరులూ ఉంటారు. మొత్తం 45 మంది బృందంతో కేసీఆర్ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారికి ఐదు కోట్ల రూపాయల విలువైన మకరకంఠి, సాలిగ్రామ హారాన్ని రేపు కేసీఆర్ సమర్పించనున్నారు.

కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రభుత్వ సలహాదారు రమణాచారి ముందుగానే తిరుమల చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం శ్రీవారిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఏపీ ప్రభుత్వం కేసీఆర్ రాక సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతిలో కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ప్రత్యేక పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ 11 ఏళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకోనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఏపీ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*