నపుంసకులను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారన్న టీడీపీ నేత

కరణం బలరాం

నపుంసకులను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కరణ బలరాం డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నపుంసకుడని, గత పది రోజులుగా గొట్టిపాటి చేస్తున్న చర్యల ఫలితమే ఈ హత్యలని కరణం బలరాం స్పందించారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో గొట్టిపాటి, కరణం వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కరణం వర్గీయులు మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కరణం గొట్టిపాటి, టీడీపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యలకు కారణం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అని కరణం తెలిపారు. అలాంటి వారిని పార్టీలో చేర్చకున్న టీడీపీ, చంద్రబాబు దీనిపై సమాధానం చెప్పాలని కరణం డిమాండ్ చేశారు. కాగా అద్దంకి మండలం వేమవరంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. పోలీసులు 144వ సెక్షన్ విధించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించబోనని చంద్రబాబు హెచ్చరించారు.

Ravi Batchali
About Ravi Batchali 36875 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*