నవరత్నాలూ జగన్ ను సీఎం చేస్తాయా?

వైసీపీ అధినేత జగన్ ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించారు. నవరత్నాలు జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడతాయా? వరాల జల్లుతో పాటు అక్టోబర్ 27 నుంచి 6 నెలల పాటు 3 వేల కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు వైసీపీ జాతీయ అద్యక్షుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. మరి నవరత్నాలు జగన్ ను సీఎంను చేస్తాయా? లేదా? అన్నదే చూడాలి.

రైతుల కోసం వరాలు……

వైసీపీ ప్లీనరీ వేదిక నుంచి రైతులకు హామీలు ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్…. అధికారంలో కి వచ్చిన వెంటనే 5ఎకరాలలో పు రైతులకు 59వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఏడాదికి 12,500 చొప్పున ప్రతి ఏడాది 12,500 మే నెలలోనే నేరుగా రైతులకు అందిస్తామని ప్రకటించారు. బాంక్ లతో ప్రమేయం లేకుండా నేరుగా రైతులకే డబ్బు అందేలా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్ర బాబు నాయుడు ఎన్నికలకు ముందు బ్యాంక్ రుణాలు కట్టకండి అని చెప్పడం వల్ల ఈ రోజు రైతులకు రుణాలు కూడా రావట్లేదని ఆరోపించారు. చంద్ర బాబు మోసపూరిత హామీల వల్ల మూడేళ్ళలో రైతులకు 8వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఇన్ ఫుట్ సబ్సిడీ లు లేకపోవడం., రుణ వడ్డీలు చెల్లించకపోవడం వల్ల తీవ్ర నష్టం వచ్చిందన్నారు. రైతు రుణ మాఫీ పేరుతో మూడేళ్ళలో 11వేల కోట్లు విడుదల చేస్తే వడ్డీల రూపంలో 14వేల కోట్లు బ్యాంకు లు వసూలు చేశాయని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 33వేల కోట్ల ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 71లక్షల 66వేల మంది చిన్న.,, సన్నకారు రైతులు ఉంటే చంద్రబాబు వారిలో 80శాతం మందికి కూడా మేలు చేయలేదని .,, 5ఎకరాలలో పు ఉన్న 66లక్షల మంది రైతులకు లబ్ది కలిగించే పథకాలను అమలు చేస్తామన్నారు. అన్న వస్తున్నాడు.,, రైతులకు మేలు చేసే పథకాల గురించి విస్తృత ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు.

ఫీ రీ ఎంబర్స్ మెంట్ పునరుద్ధరణ….

లక్షలాది మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన ఫీ రీ ఎంబర్స్ మెంట్ పథకానికి పూర్వ వైభవం తీసుకు వస్తానని జగన్ ప్రకటించారు. రాజశేఖర్ రెడ్డి పాలనలో 27 లక్షల మందికి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పిస్తే , చంద్ర బాబు నాయుడు ఆ పథకాన్ని పూర్తిగా నీరు గార్చడని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీ రీ ఎంబర్స్ మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ., డబ్బు లేక ఇబ్బందులు పడకుండా ఫీజు తో పాటు ఏడాదికి 20వేల రూపాయలు ఉపకారాన్ని అందిస్తామని ప్రకటించారు.

దశల వారీగా మధ్య నిషేధం…..

కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోన్న మద్యం రక్కసిపై మూడు దశల్లో పోరాటాన్ని ప్రకటించారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో మంచి నీటి విధానం అన్నది లేకపోయినా మద్యం విధానం మాత్రం చక్కగా ఉందన్నారు. మద్యం కోసం చంద్ర బాబు చక్కటి విజన్ డాక్యుమెంట్ రూపొందించుకున్నారని మంచి నీళ్ళకు మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదన్నారు. మద్యం మానేయాలి అనుకున్నా ప్రజల్ని తాగుడు మనకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అని విమర్శించారు.అధికారంలోకి రాగానే తొలిదశలో బెల్ట్ దుకాణంలను మూసి వేయడం తో పాటు మద్యం దుకాణాల సంఖ్యాని తగ్గిస్తాం అన్నారు. సిగరెట్ పెట్టెలపై మాదిరి మద్యం తాగడం వల్ల కలిగే దుష్పరిణామం లను వివరించేందుకు కేంద్రంపై ఒత్తిడి చేస్తాం అన్నారు. సినిమాలు., టీవీ లలో మద్యం పై ప్రచారం ఉధృతం చేస్తామని., అవసరం అయితే గతంలో మద్యం పై పోరాడిన పత్రిక ల సాయం తీసుకుంటామని ప్రకటించారు. మద్యం ధర ను గణనీయంగా పెంచుతామని., సామాన్యులు కొనాలంటే భయపడే పరిస్థితి తీసుకు వస్తాం అన్నారు. మూడో దశలో సంపూర్ణ మద్య నిషేధం కోసం కఠిన సంస్కరణలు చేస్తామన్నారు. కోటీశ్వరులు తప్ప మద్యం అందుబాటులో ఉండని పరిస్థితి కల్పిస్తామని., మద్యం తయారు చేసే వారికి ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చట్టం చేస్తామన్నారు.

అధికారం చేపట్టగానే చేపట్టే 9 కార్యక్రమాలు:

1. వైఎస్సాఆర్ రైతు భరోసా కార్యక్రమం.. రూ.50వేలు ఇస్తాం.
2. డ్వాక్రా మహిళలకు వైఎస్సాఱర్ ఆసరా.. ప్రస్తుత రుణాన్ని మాఫీచేస్తాం.
3. పెన్షన్లు.. రెండువేలు ఇస్తాం.
4. అమ్మ ఒడి… చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులిస్తాం.
5. హౌసింగ్ కార్యక్రమం.. ప్రతి పేదవాడికి ఇళ్ళు ఇస్తాం.
6. ఆరోగ్యశ్రీ.. అందరూ ఆరోగ్యం అందరికీ అందేలా చూస్తాం.
7.ప్రత్యేక హోదా తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పిస్తాం.
8. జలయజ్ఞం..రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తాం
9. మద్యపాన నిషేదం..తాగిన వారికి ఏడేళ్ల జైలు.

Ravi Batchali
About Ravi Batchali 29119 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*