
పార్టీ పెట్టాలన్న యోచన తనకు లేదని నటుడు విశాల్ స్పష్టం చేశారు. అలాగే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతిస్తానో ఇప్పటి వరకూ చెప్పలేదన్నారు. తాను ఒక అభ్యర్థికి మద్దతిస్తున్నానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తాను ప్రజాసేవ చేద్దామనే ఆర్కే నగర్ ఎన్నికల బరిలోకి దిగానని, అయితే కొన్ని రాజకీయ శక్తుల జోక్యం కారణంగా తన నామినేషన్ చెల్లకుండా పోయిందని ఆయన ఆవేదన చెందారు. అంతేకాదు తన నామినేషన్ తిరస్కరణకు గురైనా ప్రజా సేవ చేస్తూనే ఉంటానన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు కీలకమన్నారు. ముందు ప్రజల సమస్యలను పరిష్కరించి తర్వాత ఆర్కే నగర్ లో ఓట్లు అడగాలన్నారు విశాల్.
పార్టీ పెట్టను….
అంతేకాదు తాను పార్టీ పెట్టాలన్న యోచనలో కూడా లేనని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. తాను ప్రజాసేవ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతాను తప్పించి పార్టీ పెట్టనని కూడా ఆయన తెలిపారు. ఆర్కే నగర్ ప్రజలకు మంచి జరిగితే తనకు అంతే చాలన్నారు. తనంటే కొందరకి ఎందుకు భయమో తనకే అర్థం కావడం లేదన్నారు. కొందరు నీచరాజకీయాలను చూసి తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. తనకు ప్రజాదరణ ఉండబట్టే కొందరు తనని టార్గెట్ చేశారని విశాల్ స్పష్టం చేశారు.
Leave a Reply