పల్లె నుంచే నారా పాలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనను పల్లె నుంచే కొనసాగిస్తున్నారు. సంక్రాంతి పండక్కి తన సొంతూరు నారావారాపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి పండగను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులతో చేసుకుంటున్నారు. ఒకవైపు పండగ చేసుకుంటూనే ముఖ్యమంత్రి నారావారిపల్లె నుంచే పాలన సాగిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం పూజలు చేసిన అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారులతో టెలఫోన్ లో మాట్లాడారు. కోడిపందేల విషయంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించారు. తన దావోస్ పర్యటకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకల విషయంలో కూడా ఏవిధంగా లబ్దదారులకు చేరాయో ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు సంక్రాంతి పండగ చేసుకుంటూనే పాలనను కూడా పల్లె నుంచే కొనసాగిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*