పవన్ అంటే భయమా?

జనసేన అధినేత పవన్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాఫ్ట్ కార్నర్ గా వెళుతున్నాయా? వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ప్రతి డిమాండ్  ను పరిశీలించి…పరిష్కరించేదిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ప్రత్యేక హోదా కోసం పవన్ జిల్లాల్లో సభలు పెడుతున్నా స్పందించని సర్కార్ పవర్ స్టార్ డిమాండ్  చేసే స్థానిక  సమస్యలను మాత్రం పట్టించుకుంటోంది.

ఉద్దానం సమస్యనే తీసుకుందాం. గతంలో అనేక రాజకీయపార్టీలు ఈ సమస్యపై గళమెత్తాయి. నినదించాయి. మీడియా సమావేశాల్లో కూడా ప్రస్తావించాయి. వైసీపీ అధినేత జగన్ కూడా ఉద్దానం సమస్య ను పరిష్కరించాలని పలుసార్లు కోరారు. కాని సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేదు. కాని అదే సమస్యను పవన్ లేవనెత్తితే మాత్రం వెంటనే రంగంలోకి దిగాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకవైపు ముద్రగడ ప్రభుత్వంపై కాపు రిజర్వేషన్ కోసం ఒత్తిడి తెస్తుంటే ….పవన్ ను మచ్చిక చేసుకోవటంలో భాగంగానే ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపుతామని ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేశాయి. దీంతో పవన్, టీడీపీ, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఏమైనా ఉందేమనని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*