
జనసేన అధినేత పవన్ కళ్యాణ్-ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు మధ్య భేటీకి టైం ఫిక్స్ అయ్యింది. జులై 30, 31 తేదీలలో పవన్ కళ్యాణ్., చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ప్రధానంగా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై చర్చించేందుకు పవన్ ముఖ్యమంత్రిని కలవనున్నారు. అదే సమయంలో రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ పాదయాత్రను ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ-జనసేనల మధ్య రాజకీయ అంశాలను కూడా ప్రవస్తానకు వచ్చే వీలుంది. ఉద్దానం కిడ్నీ సమస్యలపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం పెన్షన్లు., డయాలసిస్ సెంటర్లను ప్రకటించింది. ఇదంతా పవన్ కళ్యాణ్ చొరవతొనే జరిగిందని జనసేన చెబుతోంది. మరోవైపు ఉద్దానం కిడ్నాప్ సమస్య కారణాలను తెలుసుకునేందుకు హార్వార్డ్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 30న వారితో చర్చించిన తర్వాత పవన్ ముఖ్యమంత్రిని కలుస్తారని చెబుతున్నారు.
Leave a Reply