
హోదా పై రగడ బాగానే జరిగింది. పవన్ పిలుపుతో వచ్చిన హీట్ తో జగన్ చక్కగా చలి కాచుకున్నాడు. అదీ పొలిటికల్ పార్టీ కి, పవన్ పార్టీకి ఉన్న తేడా అని అనిపించింది.
ప్రభుత్వం మరీ ఓవర్ గాఫోకస్ చెయ్యడం వల్లో, విషయం ఉన్న విషయం టేకప్ చెయ్యడం వల్లో, జగన్ భిన్నం గా ప్లాన్ చెయ్యడం వల్లో గాని గళం ఎత్తాలి అన్న వారి లక్ష్యం నెరవేరింది. జనం ( అదే లెండి పార్టీ ల కార్యకర్తలు) బీచ్ కు రాకుండా, నాయకులు బీచ్ వేదికగా నిరసనలు చేపట్టకుండా పోలీస్ లు అడ్డుకోగలిగారు. బ్రహ్మాండం గా పని చేసి, ప్లాన్డ్ గా వ్యవహరించారు. ఈ కోణం లో పోలీస్ లు సక్సెస్ అయ్యారు.
ఐతే వేలాది మంది బీచ్ లో నిరసనలకు రాకుండా అడ్డుకున్నా….నిరసనకారులు మాత్రం టార్గెట్ రీచ్ అయ్యారు అనిపించింది. ఇష్యూ ను చర్చ చెయ్యడం వాళ్ళ ప్రధాన ఆలోచన. అది బాగా చేసారు. జగన్ ఎయిర్ పోర్ట్ సీన్ బాగా పండింది. పెద్దగా జనం లేరు,జరిగింది చిన్న నిరసనలు అనుకున్న సమయం లో జగన్ ఎయిర్ పోర్ట్ ఎంట్రన్స్ ఎపిసోడ్ అటెంషన్ డ్రా చేసింది. జాతీయ స్థాయిలో చర్చను పెట్టారు జగన్. రన్ వే మీద బైఠాయింపు బాగుంది.తరవాత కూడా ఎయిర్ పోర్ట్ బయట జగన్ రగడ చర్చ జరిగేలా, మైలేజ్ వచ్చేలా సాగింది. జగన్ కాని, అయన పార్టీ గాని ఏది అయితే ఆశించారో అది నెరవేరింది.
అంతా మరిచి పోతున్న, మరుగున పడిపోతున్న హోదా ఇష్యూ ని ఎంతో కొంత తెర పైకి తెచ్చారు. ఈ ఒక్క ఇష్యూ తో బాబు అధికారం పడిపోదు…జగన్ అధికారం లోకి రాలేడు…. కానీ మొత్తం వ్యవహారం లో ప్రభుత్వం మాత్రం విఫలం అయ్యింది. మరీ ఎక్కువ నిర్బంధం అనే ఆలోచన ప్రభుత్వ తప్పుడు వ్యూహంగా అనిపిస్తుంది.
ఇక పోతే పవన్ ట్వీట్ లతో వచ్చిన క్రేజ్ ని జగన్ జాగ్రత్తగా వాడుకున్నాడు.అందుకే పోలీసులు గెలిచారు….రాజకీయం గా ప్రభుత్వం ఓడింది.
Leave a Reply