బాబును టార్గెట్ చేసిన మావోలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మావోయిస్టులు టార్గెట్ చేశారు. చంద్రబాబుపై దాడి చేయడానికి మావోలు రెక్కీ కూడా నిర్వహించిన విషయం ఇప్పుడు బయటపడింది. చంద్రబాబు ఢిల్లీ ఇటీవల వెళ్లి వచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాబార్డు ఇచ్చే చెక్కును అందుకోవడానికి, ముఖ్యమంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు వెళ్లారు. బాబు పర్యటనకు ముందు మావోలు ఆరుసార్లు రెక్కీ నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసుల విచారణలో వెల్లడయింది. పాత్రికేయుల రూపంలో వచ్చి చంద్రబాబుపై దాడి చేయాలన్నది మావోల వ్యూహమని తేలింది. ఏపీ భవన్ పరిసరాల్లో అనేకసార్లు రెక్కీ నిర్వహించారని తెలిసింది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ భవన్ లో భద్రతాలోపాలు ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కు కూడా వారు చెప్పినట్లు సమాచారం.

ఇటీవల ఆంధ్రా ఒడిషా బోర్డర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టు అగ్రనేత ఆర్కే మాత్రం ఈ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ కు ప్రతికారంగానే మావోలు చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారని చెబుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లోనూ, ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయంలోనూ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రతి వారినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోనికి పంపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*