
ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. రాజకీయ దురంధురులను ఆయన చూశారు. వారి దగ్గర అనేక మెళకువలను నేర్చుకున్నారు. తన దైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అప్రతిహత విజయాలు నమోదు చేశారు. సైబరాబాద్ వంటి మహానగరాలను నిర్మించారు. బిల్‌గేట్స్ వంటి ప్రపంచ దిగ్గజాలను హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. కేసీఆర్ వంటి రాజకీయ పండితులకు పాఠాలు నేర్పారు. ఇంతగా తన జీవితానికి రాజకీయాలకు మధ్య అవినా భావ సంబంధం ఏర్పరుచుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా తొమ్మిదేళ్లపాటు ఆయన అప్రతిహతంగా పాలించారు. ఇప్పుడు ఏపీకి సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. రాజకీయంగా ఆయన చూడని ఎత్తుపల్లాలు లేవు. అధిరోహించని శిఖరాలూ లేవు. తీర్చిదిద్దిన నేతలు లక్షల సంఖ్యల్లోనే ఉన్నారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి….
మరి అలాంటి చంద్రబాబు నిజంగానే ఏరికోరి రాజకీయాల్లోకి వచ్చారా? ఉద్దేశ పూర్వకంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి కాలూనారా? ఆయన ఏమనుకున్నారు? తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలని భావించారు? తన జీవితం ఇలా ఉంటే బాగుంటుం ది కదా? అని ఏనాడూ నిర్దిష్టంగా ఓ గీత పెట్టుకోలేదా? అంటే.. ఉన్నాయనే సమాధానం వస్తోంది. సాక్షాత్తూ చంద్రబాబే తన జీవితం గురించి వెల్లడించారు. ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చిందీ చెప్పుకొచ్చారు. తాను జీవితాన్ని ఎలా తీర్చి దిద్దు కుంటే బాగుంటుందో తాను ముందుగానే నిర్దేశించుకున్నట్టు తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని మొదట అనుకోలేదనీ చెప్పారు. అసలు మొదట్లో రాజకీయాలంటే.. మనకు కాదు..! అని కూడా భావించినట్టు తెలిపారు. అయితే, అనూహ్యంగా ఆయన రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన మొదట్లో ఊహించలేదని చెప్పారు.
ఐఏఎస్ అవ్వాలని కల….
పీజీ పూర్తయ్యాక.. ఆయన చదువుపై కాన్సన్ట్రేట్ చేశారు. మరింత ఉన్నత చదువు చదవాలని అనుకున్నారు. అంతేకాదు, ప్రజా సేవలో పీక్ పొజిషన్ అయిన ఐఏఎస్ చేయాలని కూడా కలలు కన్నారు. ఓ జిల్లాకు కలెక్టర్ అయితే, ఆ జిల్లా మొత్తా న్ని బాగు చేయొచ్చు. తన మనసులో ఏవిధంగా ప్రజా సేవ చేయాలని నిర్దేశించుకుంటే ఆ విధంగానే ముందుకు వెళ్లొ చ్చు అని నిర్ణయించుకున్నారు. తొలుత ఐఏఎస్‌కు సంబంధించిన పుస్తకాలను ముందేసుకుని ఓ వారం రోజులు కుస్తీ పట్టారు. ఇంతలోనే తనకు తెలిసిన మిత్రుల ద్వారా అప్పటి ఓ నేత గురించి తెలుసుకున్నారు. ఆయన చేస్తున్న ప్రజా సేవ గురించి తెలుసుకున్నారు.
వారి చేతనే సేవ చేయించాలని….
అంతే! ఒక్కసారిగా ఐఏఎస్ పుస్తకాలను పక్కన పడేశారు. తాను ఐఏఎస్ అయితే, కేవలం ఓ జిల్లాకు మాత్రమే పరిమితమై సేవ చేసే అవకాశం వస్తుందని భావించారు. అదే తాను ఓ రాజకీయ నేతగా ఎదిగితే.. ఓ రాష్ట్రం మొత్తానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందని గుర్తించారు. అంతేకాదు.. తాను ఏ ఐఏఎస్ కావాలని భావించారో.., అలాంటి ఐఏఎస్, ఐపీఎస్‌లతో తానే సేవ చేయించే, నియంత్రించే అవకాశం కూడా ఉంటుందని గుర్తించారు. వెంటనే అప్పటి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇంతింతై.. అన్నట్టుగా బాబు ప్రస్థానం ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది. మొత్తానికి ఐఏఎస్ కావాలనుకున్న బాబు.. పొలిటీషియన్ అయ్యారన్న మాట
Leave a Reply