బాబు గారి బడాయి…..కాంట్రాక్టర్లు విలవిల

ఏపీలో గొప్ప ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ సంస్థ ఏమిటని అడిగితే మొదట చెప్పాల్సిన పేరు రాష్ట్ర ప్రభుత్వం పేరే….. అది బిజినెస్‌ సమ్మిట్‌ కావొచ్చు…. పుష్కరాలు కావొచ్చు…. శంకుస్థాపనలు కావొచ్చు… . కార్యక్రమం ఏదైనా అదిరిపోయేలా నిర్వహించడంలో ఏపీ సర్కారు తర్వాతే ఎవరైనా … కళ్లు చెదిరే ఏర్పాట్లు….. ఐవిఆర్‌ఎస్‌ ఫీడ్‌ బ్యాక్‌లు., టెక్నాలజీతో మానటరింగ్‌…, వచ్చే వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి టీం తర్వాతే ఎవరైనా…… అయితే ఇదంతా నాణానికి ఒకవైపే…… మరో వైపు ఈ పనులు చేసిన వాళ్లకు మాత్రం అప్పులు…. వాటిపై వడ్డీలు మాత్రమే మిగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ల పాలనలో చాలా మెగా ఈవెంట్లను నిర్వహించింది. వాటిలో కృష్ణా., గోదావరి పుష్కరాలు ఒకటి…. లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎక్కడా అపరిశుభ్రత తలెత్తకుండా పర్యావరణ అనుకూలమైన ఏర్పాట్లను చేశామని అప్పట్లో గొప్పలు చెప్పుకుంది. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌ కంపెనీలను తీసుకువచ్చారు. అలా వచ్చిన వాటిలో గుజరాత్‌కు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులు మొదలుకుని కుంభమేళాల వరకు లక్షలాది జనం వచ్చే కార్యక్రమాలను నిర్వహించిన కంపెనీలు ఏపీ ఈవెంట్లలో కూడా పాల్గొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు కావడంతో పేమెంట్లు కూడా పక్కాగా ఉంటాయనుకున్న ఈ సంస్థలు కోట్ల రుపాయల విలువైన పనుల్ని దక్కించుకున్నాయి. ఈ ప్రోక్యూర్‌మెంట్‌ విధానంలో టెండర్లను పిలవడంతో దేశం నలుమూలల నుంచి కాంట్రాక్టర్లు బిడ్లను దాఖలు చేయడంతో వాటిలో అనుభవం ఉన్న సంస్థలకు పనులు దక్కాయి. గుజరాత్‌ నుంచి వందలాది మంది కార్మికులతో తరలివచ్చిన సంస్థలు నగరంలో దాదాపు 50 రోజుల పాటు గోడోన్లను ఏర్పాటు చేసుకుని పనులు నిర్వహించాయి. నగరంలోని భవానీపురం., బస్టాండ్‌., రైల్వేస్టేషన్‌., గుణదల., రామవరప్పాడు., జాతీయ రహదారుల వెంట ఏర్పాటు చేసిన పుష్కరనగర్‌లలో యాత్రీకులకు అవసరమైన ఏర్పాట్లను గుజరాత్‌ సంస్థలు ఏర్పాటు చేశాయి.

వాడుకుని వదిలేశారు…..

కృష్ణా పుష్కరాలు మొదలవడానికి రెండ్రోజుల ముందు నుంచి పూర్తయ్యాక మరో రెండ్రోజుల పాటు పుష్కరనగర్‌లను నిర్వహించారు. వీటిలో పర్యావరణ అనుకూల టాయిలెట్లు, స్నానగదులు., నీటి సదుపాయాలు., వాటి శుభ్రత., క్లీనింగ్‌ యంత్రాలు అన్ని అయా ప్రైవేట్‌ సంస్థలే ఏర్పాటు చేశాయి. వీటి నిర్వహణ కోసం ఓ కంపెనీ దాదాపు 5 కోట్లకు పైగా ఖర్చు చేసింది. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా ఒక్క రుపాయి కూడా వాటికి విడుదల కాకపోవడంపై ఆ సంస్థలు ఏపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి వీటి పరిస్థితి ఎంత దారుణంా తయారైందంటే చేసిన పనుల ధృవీకరణ కోసం మొత్తం టెండరు విలువలో దాదాపు 10 నుంచి15శాతం ఇప్పటికే వివిధ స్థాయిల్లో లంచాలు చెల్లించాల్సి వచ్చిందట. వినియోగపు ధృవీకరణ., లాగ్‌ బుక్‌లలో సంతకాలకు సైతం చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు చేయి తడపకపోతే ఫైల్‌ కదలదని బెదిరింపులకు దిగారని గుజరాత్‌కు చెందిన కాంట్రాక్టర్‌ వాపోయారు. పుష్కరాల తొలి రోజు తగిన ఏర్పాట్లు చేయలేదంటూ విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌., కృష్ణా జిల్లా కలెక్టర్‌ కమాండ్‌ కంట్రోల్‌లో బెదిరింపులకు సైతం పాల్పడ్డారని గుర్తు చేసుకున్నారు. నిద్రాహారాలు మాని పుష్కరాలను సక్సెస్‌ చేస్తే బిల్లుల విడుదలకు మాత్రం డబ్బులు లేవని ఏడాది కాలంగా తిప్పుకుంటున్నారని వాపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే గుజరాత్‌ వాణిజ్య వర్గాలకు సమాచారం ఉందని., ఏపీలో ఎలాంటి పనులు., కాంట్రాక్టులు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న పెద్ద సంస్థలకు సైతం ఇలాంటి బాకీలు భారమేనని., దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమాత్రం సమర్ధనీయం కాదని చెబుతున్నారు. మరోవైపు గుజరాత్‌‌కు చెందిన ప్రముఖ కంపెనీలకు ఏపీలో జరిగిన నష్టంపై పిఎంఓకు ఫిర్యాదు చేయాలని గుజరాత్‌ వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో ఏపీలో ముందస్తు పూచీకత్తులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 33894 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*