బెజవాడ వైసీపి ఆపరేషన్ జగన్ స్టార్ట్ చేశారా?

వైసీపీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడలో వైసీపీ బలపడేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టున్న వైసీపీకి బెజవాడలో మాత్రం పట్టులేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీని వీడి వెళ్లిపోవడంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండానే పోయింది. గత ఎన్నికల్లో వైసీపీ అనేక తప్పులు చేసింది. బంధువులు చేసిన సిఫార్సులకు జగన్ తలవంచడం, ఖచ్చితమైన అభ్యర్థిని ఎంపిక చేయకపోవడం వల్ల బెజవాడ రాజకీయాల్లో జగన్ కు పట్టు చిక్కలేదు. రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా జగన్ కు ఇబ్బందిగానే మారింది. దీంతో జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. విజయవాడలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జగన్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నారు. కొందరు నేతలకు పదవులిచ్చి ప్రధాన బాధ్యతలను అప్పగించడంతో పాటుగా మరికొందరిని తప్పేంచాలని కూడా జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బెజవాడలో పార్టీకి గట్టి పునాదులు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం పడుతుందని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకోసమే జగన్ బెజవాడపై తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది.

ఇన్ చార్జుల మార్పుతోనైనా బలం పెరిగేనా?

బెజవాడలో వైసీపీ చాలా బలహీనంగా ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో జగన్ చేసిన కొన్ని తప్పులే. విజయవాడ సిటీలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీకి కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొందిన జలీల్ ఖాన్ తర్వాత పార్టీని వీడి వెళ్లిపోయారు. తర్వాత అక్కడ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. అయితే ఈ నియోజకవర్గంలో ముస్లింలు అధికంగా ఉండటంతో ఇన్ ఛార్జి పదవిని ముస్లింలకు ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరోనియోజకవర్గమైన విజయవాడ సెంట్రల్ లో ప్రస్తుతం ఇన్ ఛార్జిగా వంగవీటి రాధా ఉన్నారు. రాధా యాక్టివ్ గా లేరు. అడపా దడపా కన్పించడం తప్ప అసలు వంగవీటి కుటుంబం అనేది ఒకటుందా? అన్న అనుమానం కలుగుతోంది. అయితే తాజాగా కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి చేరిన మల్లాది విష్ణుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ ఛార్జితో పాటు విజయవాడ నగర అధ్యక్షుడిగా నియమించాలని జగన్ భావిస్తున్నారు. వంగవీటి రాధకు తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లోనూ మార్పులు తప్పవంటున్నారు వైసీపీ నేతలు. బెజవాడలో వైసీపీ బలం పెరగాలంటే నేతలను మార్చాల్సిందేనంటున్నారు వైసీపీ క్యాడర్. దీంతో జగన్ కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 31035 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*