
బీజేపీకి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి గుడ్ బై చెప్పేశారు. బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నాగం జనార్థన్ రెడ్డి పార్టీ నేతల వ్యవహారశైలి పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఆయన పార్టీ వీడతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. నాగం కూడా ఉగాది తర్వాత పార్టీని వీడతానని చెప్పారు. అయితే బీజేపీ నేతలు నాగం జనార్థన్ రెడ్డిని సముదాయించేందుకు ప్రయత్నం చేశారు. కాని నాగం జనార్థన్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయిపోయారు. మరికాసేపట్లో ఆయన తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపనున్నారు. త్వరలోనే నాగం కాంగ్రెస్ లో చేరే అవకాశముంది.
Leave a Reply