
భారత్ కల నెరవేరేలా కన్పించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం గురించి భారత్ ఎప్పిటినుంచో ప్రయత్నిస్తుంది. అయినా సాధ్యం కావడం లేదు. ఏదో ఒక దేశం మోకాలడ్డుతూనేఉంది. అయితే అమెరికా సయితం భారత్ కు ఐక్యారజ్యసమితిలో శాశ్వత సభ్యత్వంకల్పించేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ఈ సారి గ్యారంటీ అనుకున్నారు.కాని ఈ సారి అడ్డుపడింది మాత్రం రష్యా, చైనాలేనట. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి నిక్కీ హేలీ వెల్లడించారు. అమెరికా, భారత దేశ మిత్రమండలి నిర్వహించిన సమావేశంలో హేలీ మాట్లాడారు. ఈ సందర్భంగా హేలీ మాట్లాడుతూ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ కు ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే వీటో అధికారాల గురించి మాత్రం భారత్ ఆలోచించకూడదని హేలీ చెప్పారు. వీటో అధికారాన్ని భారత్ కోరుకోకుంటే శాశ్వత సభ్యత్వం లభిస్తుందని చెపపారు. వీటో అధికారాల జోలికి ఎవరూ రాకూడదన్నదే సభ్యదేశాల ఆలోచనని, సంస్కరణలు చేపట్టాలంటే వీటో అధికారం ప్రధానంగా మారిందని ఆమె వెల్లడించారు.
చైనా, రష్యాలే వ్యతిరేకం….
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఇప్పటికే శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలుగా రష్యా, చైనా, బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలున్నాయి. ఏ దేశంకూడా వీటో వేరే దేశం జోక్యాన్ని కోరుకోవడం లేదని హేలీ చెప్పారు. ప్రధానంగా భారత్ కు చైనా, రష్యాలే శాశ్వతసభ్యత్వం ఇచ్చేందుకు అడ్డుగా ఉన్నాయి. భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశంగా ఉన్న ఫ్రాన్స్ మాత్రం సంస్కరణలకు మద్దతు తెలిపింది. మొత్తం మీద ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యతం పొందడం భారత్ కు కలగానే మిగిలిపోతుందని హేలీ వ్యాఖ్యలుచెప్పకనే చెబుతున్నాయి.
Leave a Reply