మోడీతో జగన్ భేటీపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు

చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోడీని జగన్ కలిసిన తర్వాత టీడీపీ మంత్రులు చేసిన విమర్శలు బీజేపీ, టీడీపీల మధ్య పొత్తుకు విఘాతం కల్గించే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అమెరికా నుంచి తిరిగి వచ్చిన చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. జగన్ ప్రధాని మోడీని కలవడం వెనక ఎవరున్నారన్న దానిపై తాను ఇప్పటికే కూపీలాగుతున్నానని, అయితే నేరుగా ప్రధాని మోడీని, బీజేపీని విమర్శించడం తగదని చంద్రబాబు మంత్రులకు హితవు చెప్పినట్లు సమాచారం. బీజేపీని, మోడీని మంత్రులు విమర్శించినందువల్లే రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీపై విమర్శలకు దిగారన్న విషయాన్ని చంద్రబాబు మంత్రులకు గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో పొత్తుతో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్ష నేతకు ప్రధాని కార్యాలయం అపాయింట్ మెంట్ ఇవ్వడం తప్పేనని చంద్రబాబు సయితం అంగీకరించారని ఒక సీనియర్ నేత చెప్పారు. అయితే ఏ కారణాల వల్ల ఇది జరిగిందీ తెలుసుకునే ప్రయత్నంలో తానున్నానని తొందరపడి మోడీ, బీజేపీలపై విమర్శలకు దిగవద్దని చంద్రబాబు సూచించారు.

మోడీపై విమర్శలు వద్దు…..

ఈ నేల 10వ తేదీన చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండగానే ప్రధాని మోడీతో వైసీపీ అధినేత జగన్ రహస్య భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ప్రధాని కార్యాలయంపైన కూడా విమర్శలు చేశారు. ఎవరో దగ్గరుండి బీజేపీనేత జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ నేతలు టీడీపీ తీరును తప్పుపట్టారు. ప్రతిపక్ష నేత ప్రధానిని కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వాలంటే టీడీపీ అనుమతి తీసుకోవాలా? అని కూడాప్రశ్నించారు. దీంతో మంత్రులకు ఏం చేయాలో తెలియక చంద్రబాబు వద్ద తమ మనసులో మాటను బయటపెట్టారు. అయితే జగన్ తో బీజేపీ పొత్తుకు వెళ్లే ప్రసక్తి లేదని చంద్రబాబు మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. అధికారంలో టీడీపీ ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా అధికారం టీడీపీదేనని సర్వేలు చెబుతుంటే బీజేపీ వైసీపీతో పొత్తుకు ఎందుకు వెళుతుందని ఆయన కొందరు మంత్రులను ప్రశ్నించినట్లు తెలిసింది. మొత్తం మీద ఇకపై మోడీ, బీజేపీపై విమర్శలకు దిగవద్దని, జగన్ నే టార్గెట్ చేయాలని చంద్రబాబు మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 36022 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*