మోడీపై శివసేన విసుర్లు

శివసేన

మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీపై శివసేన శివాలెత్తిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోడీ ప్రసంగంలో కొన్నింటిని ప్రశంసిస్తూనే మోడీ కఠిన వైఖరిని ప్రదర్శించడం లేదని విమర్శించింది. మోడీ ఆగస్టు 15వ తేదన చేసిన ప్రసంగంలో కాశ్మీర్ లో తూటాలతోనే తీవ్రవాదాన్ని తిప్పికొట్టలేమని, కాశ్మీరీలకు దగ్గర కావడం, వారి మనసులను గెలుచుకోవడం ద్వారానే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. ప్రధాని ఆలోచనలు సరైనవే అయినప్పటికీ భారత రాజ్యాంగం నుంచి 370వ అధికరణను తొలగించకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించింది.

వందేమాతరం సంగతేంటి?

కాశ్మీరీలను మనసులను గెలుచుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించాలన్నది మంచిదే అయినప్పటికీ, 370వ అదధికరణను తొలగించడం కూడా అంతే అవసరమని అభిప్రాయపడింది. మత విశ్వాసాల పేరుతో దేశంలో హింస చెలరేగుతుంటే ముస్లింలే కాదు హిందువులు కూడా అభద్రతకు లోనవుతున్నారని సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. వందేమాతం విషయంలో ప్రధాని ఖచ్చితత్వాన్ని ప్రదర్శించడం లేదని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో కఠిన వైఖరిని అవలంబించిన మోడీ, వందేమాతరాన్ని తప్పనిసరి చేసే విషయంలో ఎందుకు ధృఢ వైఖరిని ప్రదర్శించడం లేదని ప్రశ్నించింది. మొత్తం మీద శివసేన మరోసారి ప్రధానిపై తన సంపాదకీయం ద్వారా విరుచుకుపడిందనే చెప్పాలి.

Ravi Batchali
About Ravi Batchali 25553 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*