
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మోడీ కిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయారు. మోడీ చంద్రబాబు పై పెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీని రామ్ నాథ్ కోవింద్ కు మద్దతిచ్చే విధంగా మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబును కోరారు. ఈ విషయం లోకల్ మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలో సైతం ఫోకస్ అయింది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగల సమర్ధుడు చంద్రబాబు అని గుర్తించి మోడీ మమతను ఒప్పించే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అలాగే ఇటీవల విజయవాడ కు వచ్చిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సయితం మమత బెనర్జీని రాష్ట్రపతి ఎన్నికల్లో ఒప్పించేందుకు మీరు చొరవ తీసుకోవాలని కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే మమత విదేశాల నుంచి వచ్చిన తర్వాత తాను మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. ఈ విషయాలన్నీ జాతీయ మీడియాలో ఒకటే పనిగా ప్రసారం చేయడంతో చంద్రబాబు ఇమేజ్ బాగా పెరిగింది.
మీరా కుమార్ కే మద్దతన్న మమత…..
అయితే చంద్రబాబుతో మాట్లాడేందుకు కూడా మమత ఇష్టపడలేదు. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా మిగిసింది. విపక్షాల అభ్యర్థిగా మాజీ లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ నామినేషన్ కూడా వేశారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కే తన మద్దతని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రకటించారు. దీంతో చంద్రబాబు మమతను ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికేలా చేయలేకపోయారు. మరి చంద్రబబాబు మోడీకిచ్చిన మాట తప్పినట్లేనా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. మమత బీజేపీ అంటేనే మండిపడుతోంది. అటు డార్జిలింగ్ రగిలిపోవడానికి కారణం బీజేపీయేనని మమత భావిస్తుంది. అలాగే పెద్దనోట్ల రద్దు సమయంలో కూడా మమత తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి మమత బీజేపీ పోటీచేయించిన అభ్యర్థికి మద్దతు ఎలా ఇస్తారు. ఒకవేళ చంద్రబాబు చెబితే మమత అంగీకరిస్తారా? తొలి నుంచి మమత బీజేపీకి పూర్తి వ్యతిరేకంగా కన్పించడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు మోడీ ఇచ్చిన టాస్క్ లో ఫెయిల్ నట్లేనన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
Leave a Reply