
ప్రధాని నరేంద్ర మోడీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కల్గిస్తూ…ట్రాఫిక్ ను గంటల తరబడి ఆపేసేందుకు దేశంలో తిరుగుతున్న బుగ్గ కార్లను నియంత్రించారు. వీవీఐపీ సంస్కృతికి మోడీ మంగళం పాడేశారు. దేశ వ్యాప్తంగా బుగ్గ కార్లు తిరుగుతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్గిస్తున్నాయి. అంతేకాకుండా ఎప్పుడు పడితే అప్పడు రోడ్లమీద ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తుతోంది. దీంతో పాటు సహాయ మంత్రులు సయితం వీవీఐపీల్లా రోడ్ల మీదకు వస్తుండటానికి ప్రధాని మోడీ చెక్ పెట్టేశారు. మే 1వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా బుగ్గ కార్లు ఎవరూ ఉపయోగించ కూడదు.
కొందరికి మినహాయింపు…
అయితే వీటిలో కొందరికి మినహాయింపు నిచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్ లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే అత్యవసర సేవలకు వినియోగించే అంబులెన్స్ లు, పోలీసుల వాహనాలకు మాత్రం ఎర్రబుగ్గ ను ఉపయోగించుకోవడానికి అనుమతిచ్చారు. కేంద్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశంలో వీవీఐపీ కల్చర్ కాస్త తగ్గుతుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్త మవుతోంది.
Leave a Reply