రజనీ చెప్పేస్తారా…ఫ్యాన్స్ కోరిక తీరుస్తారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులతో సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం నాలుగోరోజున రజనీ తన ఫ్యాన్స్ తో సమావేశం అవుతున్నారు. జిల్లాల వారీగా సమావేశమవుతున్న రజనీ ఫ్యాన్స్ తో విడివిడిగా ఫొటోలు దిగుతున్నారు. అయితే శుక్రవారంతో రజనీ అభిమానులతో సమావేశాలు పూర్తి కానున్నాయి. అయితే రజనీ తన రాజకీయ రంగంప్రవేశంపై మాత్రం ఊహాగానాలను అలాగే ఉంచుతారా? లేక తెరదించుతారా? అన్నది రేపు తేలనుంది. చివరి రోజు సమావేశాల్లో రజనీ నుంచి తన రాజకీయ ప్రవేశంపై ఏదైనీ చెబుతారేమోనని ఇటు అభిమానులతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

చివరి రోజున కీలక ప్రకటన?

అయితే తొలిరోజు సమావేశంలో దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని రజనీ చేసిన ప్రకటనకు అన్ని రాజకీయ పార్టీల నుంచి అనుకూల స్పందన వచ్చింది. తమిళనాడులోని డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ నేతలు రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. కాని రజనీ ఫ్యాన్స్ మాత్రం ఆయన కొత్త పార్టీ పెట్టాల్సిందేనని కోరుతున్నారు. నాలుగురోజుల నుంచి జరుగుతున్న సమావేశాల్లో కూడా ఆయన ఫ్యాన్స్ రాజకీయాల్లోకి రావాలని, ఈ రాష్ట్రాన్ని రక్షించాలని నినాదాలు చేయడం కన్పించింది. అయితే చివరి రోజు సమావేశంలో తమ అభిమాన హీరో నుంచి సంచలన ప్రకటన వస్తుందేమోనన్న ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉంది. అయితే రజనీ ఇప్పటికే ఏ పార్టీకి తాను మద్దతు ప్రకటించలేదని, మీరు కూడా ఏ పార్టీకీ పనిచేయవద్దని తొలి రోజు సమావేశాల్లో చెప్పిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకుంటూ తలైవా చివరిరోజు సంచలన ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద నాలుగు రోజుల నుంచి చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో రజనీతో ఫ్యాన్స్ భేటీ ఒక పండగ వాతావరణంలా ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 30963 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*