విన్నర్ మూవీ రివ్యూ

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, జగపతి బాబు, కళ్యాణి
మ్యూజిక్ డైరెక్టర్: థమన్
ప్రొడ్యూసర్: నల్లమలుపు బుజ్జి
డైరెక్టర్: గోపీచంద్ మలినేని

సాయి ధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తనకి ఎవరు ఉన్నా లేకపోయినా మెగా అభిమానుల అండ వుంటుందనే కాన్ఫిడెన్స్ తో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తన సినిమాల్లో తన మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ల సినిమాల్లో సీన్స్ వాడుకుంటూనే మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఇప్పుడిప్పుడే మారుతున్నాడు. అయితే సాయి నటించిన సినిమాలన్నీ ఇప్పటివరకు అతని కెరీర్ కి ఉపయోగపడే విధంగా లేవు. ఏదో వచ్చిన కథని నమ్ముకుని ఆ సినిమాల్లో నటిస్తూ యావరేజ్ హిట్స్ తో… సినిమాల్లో ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా దూసుకుపోతున్నాడు. ఇక ప్రతివొక్క వేడుకల్లో తన మామలను పొగుడుతూ మెగా ఫ్యాన్స్ దృష్టి తన మీదే ఉండేలా ప్లాన్ చెసుకుంటున్నాడీ మెగా హీరో. తాజాగా జరిగిన విన్నర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సాయి ధరమ్ తేజ్ తన మార్కెట్ ని చూసి కూడా తనపై ఇంత పెట్టుబడి పెట్టడం తనకు ఆశ్చర్యంగా ఉందని సెలివిచ్చాడు. అంటే తన మార్కెట్ కి ఈ సినిమా బడ్జెట్ ఎక్కువనా దాని మీనింగ్. ఇకపోతే ఆ మధ్యన వచ్చిన ‘తిక్క’ సినిమా డిజాస్టర్ తర్వాత కుంగిపోకుండా మళ్ళీ ‘సుప్రీం’ సినిమా తీసి యావరేజ్ హిట్ కొట్టిన సాయి ధర్మ తేజ్ ఇప్పుడు గోపి చంద్ మలినేనితో కలిసి విన్నర్ అంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రంలో సాయి ధర్మ తేజ్ కి జోడిగా రకుల్ ప్రీత్ నటిస్తుంది. ఆమె తన నటన కన్నా తన అందాన్ని గట్టిగా నమ్ముకుని సినిమాల్లో దూసుకుపోతుంది. ఆమె అందాల ఆరబోతతో సినిమాలకు సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అందరూ కామెంట్స్ కూడా చేస్తుంటారు. మరి ఇప్పుడు ఈ ‘విన్నర్’ లో కూడా రకుల్ అందాల ఆరబోతతో పిచ్చెకించడం ఖాయమనే మాట ఆ సినిమా ట్రైలర్స్ , పాటల ప్రోమోస్ చూసిన వారికి తెలుస్తుంది.. ఇక గోపీచంద్ మలినేని రవి తేజ కు ‘బలుపు’ వంటి హిట్ ఇచ్చి అతని కెరీర్ కి ఉపయోగపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు సాయి కి కూడా ఒక మంచి హిట్ ఇవ్వాలని అతనితో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇవన్నీ ‘విన్నర్ ‘చిత్రానికి ఒక ఎత్తుఅయితే ఈ ‘విన్నర్’ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే బుల్లితెర గ్లామర్ గర్ల్ అనసూయ ఐటెంసాంగ్లో దున్నేయడం. ఇక అనసూయ అందాలతో కుర్రకారు మతులు పోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా వుంది. అంతే కాకుండా ఈ ఐటెం పాటని మరో యాంకర్ సుమతో పాడించడం. ఇక సాయి ధర్మ తేజ్ హార్స్ రైడింగ్ వంటి అంశాలతో ఈ సినిమా హైప్ క్రియేట్ చేసింది. మరి ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ ‘విన్నర్’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందు ‘విన్నర్’ గా నిలుస్తుందో లేదో చూడాలంటె సమీక్షలోకి వెళ్లాల్సిందే.

కథ: లక్ష్మి, మహేందర్ రెడ్డి ( కళ్యాణి, జగపతిబాబు) లు ప్రేమించి పెళ్లి చేసుకుని మహేందర్ రెడ్డి తండ్రిఆదరణకు, తిరస్కరణకు గురౌతారు. ఇక వీరు ఇద్దరూ తన తండ్రికి దూరంగా బ్రతుకుతుంటారు. వీరికి ఒక బాబు సిద్దార్థ్(సాయి ధర్మ తేజ్) పుడతాడు. ఇక మహేందర్ రెడ్డి ఇంట్లో నుండి వెళ్లిపోయాక అతని తండ్రి గుర్రపందేలపై మోజుతో ఉన్న ఆస్తినంతా కరగబెట్టేస్తాడు. ఇక ఆస్తి నష్ట పోయాక కొడుకు విలువ తెలుస్తుంది. వెంటనే తనకొడుకు, కోడలు, మనవడిని తిరిగి ఇంటికి పిలిపిస్తాడు. ఇక తన మనవడి సిద్దార్థ్ పై కోపంతో తండ్రి కొడుకుల మధ్యన చిచ్చు పెడతాడు సిద్దార్థ్ తాతయ్య. చిన్న చిన్న విభేదాలతో తండ్రి మీద కత్తి కట్టిన సిద్దర్థ్ ఇంటినుండి బయటికి వెళ్ళిపోతాడు. కొడుకు తిరిగి ఇంటికి రావడం కోసం మహేందర్ రెడ్డి పూజలు, హోమాలు జరిపిస్తాడు. అయితే ఒకొనొక సమయంలో సితార ( రకుల్ ప్రీత్ సింగ్) తో ప్రేమలో పడతాడు. సిద్దార్థ్ ఆమెను ప్రేమించడం సితార తండ్రికి ఇష్టం లేక సితార పెళ్లి ఆది(అనూప్‌ సింగ్‌)తో సెటిల్ చేస్తాడు. సితారకు ఆ పెళ్లి ఇష్టం ఉండకపోవడంతో సిద్దార్థ్ కి ఆది కి మధ్యన ఒక పందెం పెడుతుంది. అందులో ఎవరు గెలిస్తే వల్లనే పెళ్లాడతానని చెబుతుంది. మరి ఆ పందెంలో సిద్దార్థ్ గెలుస్తాడా? అసలా పందెం ఏమిటి? సిద్దార్థ్ అంటే అతని తాతకి ఎందుకు ఇష్టం ఉండదు? అన్ని అనుమానాలు తొలిగి సిద్దార్థ్ తన తండ్రికి చేరువవుతాడా? అనేది మాత్రం తెర మీద వీక్షించాల్సిందే.

నటీనటులు: ఎప్పటిలాగే సాయి ధరమ్ తేజ్ డ్యాన్సుల్లో, ఫైట్స్ లో ఫుల్ ఎనర్జీ తో రెచ్చిపోయాడు. నటనతో సిద్దార్థ్ గా బాగా మెప్పించాడు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ నేమ్ తో వచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం కోసం ప్రతి క్షణం పోరాడుతూనే వున్నాడు. తన ఎనర్జీ కి నటనకు ఫుల్ మార్కులు వేయించుకున్న సాయి హార్స్ రైడింగ్ లో కూడా ఇరగదీసాడు. రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతో మరోమారు మెస్మరైజ్ చేసింది. ఇప్పటివరకు చూపెట్టిన అందాలు ఒక ఎత్తు అయితే ఈ విన్నర్ లో చూపిన అందాలు మరో ఎత్తు అనిపించేలా అందాల ఆరబోతకు దిగింది. అలాగే ఐటెం సాంగ్ చేసిన అనసూయ కూడా ఫుల్ మార్కులు కొట్టేసింది. తండ్రిగా జగపతిబాబు నటన అదరహో అనేలా వుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం: ముందుగా దర్శకుడు గోపీచంద్ మలినేని గురించి చెప్పాలంటే తాను అనుకున్న కథని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. కథ లో కొత్తదనం లేకపోయినా పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెప్పించేసాడు. కొంచెం ఫస్ట్ హాఫ్ లో కామెడీ ని నెగ్లెట్ చేసినా సెకండ్ హాఫ్ లో దానిని కవర్ చేసేసాడు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించేలా వుంది. ప్రతి ఒక్క ఫ్రేమ్ ని రిచ్ గా చూపించాడు. ఇక థమన్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. పాటలు కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ వుంది. ప్రవీణ్‌పూడి ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: సాయి నటన, రకుల్ గ్లామర్, సెకాంగ్ హాఫ్, అనసూయ ఐటెం సాంగ్
మైనస్ పాయింట్స్: కామెడీ, ఫస్ట్ హాఫ్, కథ, కథనం

రేటింగ్: 2 .5 /5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*