వీరిని పట్టిస్తే పది లక్షలివ్వనున్న ఏపీ సర్కార్

అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో లక్షలాది మంది ప్రజలు మోసపోయారని…, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ ఎక్కువ వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. అగ్రిగోల్డ్‌ అంశంపై శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. గత పదిరోజులుగా విజయవాడలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఆమరణ దీక్షలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై చర్చకు పట్టుపట్టింది. ఈ వ్యవహారంపై సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ‘అగ్రిగోల్డ్‌ మోసంపై 2014లో తొలి కేసు నమోదైందని., తర్వాత వివిధ జిల్లాల్లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసు గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చిందని., కేసును 2015, జనవరి 5న సీబీసీఐడీకి అప్పగించామన్నారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యం 9 రాష్ట్రాల్లో రూ.6,380 కోట్ల మోసానికి పాల్పడిందని., ఆంధ్రప్రదేశ్‌లో 19లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారని చెప్పారు. కేసు విచారణలో ప్రభుత్వ పాత్ర తక్కువగా ఉందని., ప్రస్తుతం హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఆస్తుల వేలం జరుగుతోందన్నారు.

సీబీఐ విచారణకు సిద్ధం….

ఏప్రిల్‌ 2016 నుంచి కమిటీ నేతృత్వంలో అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం జరుగుతోందని ఈ కేసులో 19 మంది నిందితులుగా ఉండగా.. వీరిలో 8 మందిని పోలీసులు అరెస్టయ్యారని చెప్పారు. నిధులు మళ్లించేందుకు 87 బోగస్‌ కంపెనీలు స్థాపించారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న బాధితులకు రూ.3లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు ప్రకటించారు. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుల వివరాలు చెబితే రూ.10లక్షలు ఇస్తామని సిఐడిని ప్రకటన చేయాలని కోరామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్థిక నేరాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం వేసి ఆఖరి పైసా కూడా బాధితులకు దక్కేలా చేస్తామన్నారు. అగ్రిగోడ్‌ కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. మోసపూరిత సంస్థలు చేసే ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. మనకు దక్కే ప్రతిఫలం కంటే ఎక్కువగా ఇస్తామని ఎవరైనా చెబితే కాస్త ఆలోచించుకోవాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వైట్‌ కాలర్‌ నేరాలకు పాల్పడే వారు జీవితంలో మరో నేరం చేయాలంటే భయపడేలా కఠినచర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

Ravi Batchali
About Ravi Batchali 20419 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*