వైసీపీలో ప్రశాంత్ కిషోర్ ఫీవర్

వైఎస్సార్‌సీపీ నేతలకు కొత్త భయం పట్టుకుంది. ఆ స్థాయి ఈ స్థాయి అనే తేడా లేకుండా అందర్ని కొత్త బూచి భయపెడుతోంది. ఆయనెవరో ప్రశాంత్ కిషోర్‌ అట….. ఏదో సర్వే చేస్తున్నాడంట….. 8కోట్లు ఖర్చు పెట్టి గ్రామ స్థాయి వరకు రిపోర్టులు తయారు చేశాడట., జగన్ ముఖం మీదే నిర్మొహమాటంగా అన్ని విషయాలు చెప్పేశాడట…., జగన్‌ కూడా ప్రశాంత్‌ చెప్పినవన్ని పాటిస్తున్నాడట……. ఇలా బోలెడు “ట” లు వైసీపీ నేతల్ని వేధిస్తున్నాయి. ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా ప్రశాంత్‌ కిషోర్‌ గురించే….. ఇదే అదనుగా కొందరు నేతలు మరో ప్రచారానికి తెరతీశారు. మీ స్థానం ఉంటుందో పోతుందో అంతా ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఉందంటూ మాట్లాడుతుండటంతో నేతల్ని భయం పట్టుకుంది.

టిక్కెట్లు వస్తాయా?

ఇంతా కష్టపడి పనిచేస్తే టిక్కెట్టు ఇచ్చే సమయానికి తమను అదృష్టం వరించకపోతేనో., సర్వేలో ప్రతికూల ఫలితం వస్తేనో అనే భయం చాలామందికి ఉంది. దీనికి తోడు సోషల్‌ మీడియాలో పులితోక వార్తలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండటంతో వైసీపీ నేతలు అల్లాడి పోతున్నారు. నిజానికి ఎన్నికల వ్యూహాలపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం సహకారం తీసుకోవాలని జగన్‌ భావిస్తున్నా ఇంతవరకు ఎలాంటి సర్వే జరగలేదని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రూ8 కోట్లు ఖర్చు పెట్టి ఏ సర్వే చేయించలేదని., ప్రశాంత్‌ కిషోర్‌తో కేవలం కొన్ని సమావేశాలు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. అదే సమయంలో పార్టీ క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్న అంశాలపై త్వరలో జరిగే ప్లీనరీలో జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా వివరణ ఇస్తారని చెబుతున్నారు.

Ravi Batchali
About Ravi Batchali 35929 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*