వైసీపీ ప్లేస్ కోసం జనసేన ఆరాటం !

ఏపీలో రాజకీయాలు బాగా వేడెక్కాయి. నిన్నమొన్నటి వరకు టీడీపీకి అనుబంధంగా ఉన్నట్టు జ‌న‌సేన వ్య‌వ‌హారం న‌డిచింది. మొన్న గుంటూరు మీటింగ్ తో కుండబద్దలుగొట్టినట్టు టీడీపీపై విరుచుకుపడి అందరిని ఆశ్చర్యపరిచాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ స్వరం మార్చడం అందరిని షాక్ కు గురిచేసింది. పవన్ ఎప్పుడు ఎక్కడ సభలు నిర్వహించినా వైసీపీ, బీజేపీ పై విమర్శలు గుప్పించే పవన్ ఈసారి మాత్రం టీడీపీనే టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించాడు. ఏదో మొక్కుబడిగా కేంద్రంపై, వైసీపీపై విమర్శలు చేసినా మొత్తం టార్గెట్ అంతా టీడీపీ నే అన్నట్టు తన ప్రసంగం కొనసాగించాడు.

అవే హైలెట్ అయ్యాయి….

టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్ర‌బాబు, చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేశ్ అవినీతి ప్ర‌ధాన అంశాలుగా ప‌వ‌న్ ప్ర‌సంగం కొన‌సాగింది. టోట‌ల్ ప్ర‌సంగం మొత్తానికే బాబును టార్గెట్ చేయ‌డంతో పాటు లోకేశ్ అవినీతి మీద ప‌వ‌న్ విసిరిన పంచ్‌లే హైలెట్ అయ్యాయి. అయితే ఈ ప్ర‌సంగంలో ప‌వ‌న్ ఎక్క‌డా మోడీ, బీజేపీని మాత్రం టార్గెట్ చేయ‌లేదు. ఇదే ఇప్పుడు రాజ‌కీయంగా ప‌లు ర‌కాల సందేహాల‌కు తావిస్తోంది.

పవన్ ఆలోచన ఇదేనా..?

పవన్ రాజకీయ దూకుడికి కారణం ఏంటా అని విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. పవన్ ఆలోచన చూస్తుంటే… ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ ప్రజల్లో విశ్వాసం మూటగట్టుకోవడంలో విఫలమైంద‌న్న వాద‌న ఉంది. వైసీపీకి రాజకీయ యావే తప్ప ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడాలనే ఆలోచనే లేద‌న్న విమ‌ర్శ‌లు ఎక్కువే. దీంతో పాటు జగన్ పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో జగన్ తన ఎమ్యెల్యేలను కట్టడి చెయ్యడం సర్వత్రా విమర్శలు చెలరేగాయి.

యూటర్న్ తీసుకుంది అందుకేనా?

సరిగ్గా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని రాజకీయ చక్రం తిప్పాలని పవన్ చూస్తున్నాడు. ఇప్పటి వరకు టీడీపీకి మద్దతుగా నిలుస్తూ వచ్చిన పవన్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడం …సీఎం చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్న అంశాలపై తక్షణమే స్పందిస్తూ. పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ సర్వత్రా విమర్శలు చెలరేగాయి. దీన్ని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా పవన్ జాగ్రత్త పడుతున్నాడు. అయితే ఎన్నికల సమయానికి పవన్ ఏమేర‌కు ప్రభావం చూపిస్తాడో.. ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఓట్లుగా ఎలా మార్చుకుంటాడో అనే అంశాలపైనే పవన్ , ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Ravi Batchali
About Ravi Batchali 30968 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*