శశికళ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారా?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పుడు ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడటం లేదు. కనీసం బంధువులను కూడా దగ్గరకు రానివ్వడం లేదు. శశికళలో వేదాంత ధోరణి కన్పిస్తోందని జైలు అధికారులు చెబుతున్నారు. ఉదయాన్నే దైవపూజ చేస్తున్న శశికళ రోజంతా ధ్యానం చేస్తూ గడుపుతున్నారు. తనను కలిసేందుకు బంధువులు, సన్నిహితులు వచ్చారని జైలు అధికారులు సమాచారమిచ్చినా శశికళ తిరస్కరిస్తున్నారని, ఆమె ఒంటరిగానే గడిపేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు. జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జైలు కెళ్లిన శశికళ తన అనుకున్నదేదీ జరగలేదు. ముఖ్యమంత్రిని అవుదామని అనుకుంటే అక్రమాస్తుల కేసు అడ్డుపడింది. పోనీ తన కుటుంబ సభ్యుడు దినకరన్ కూడా తన ఆశలను అడియాస చేసి జైలు కెళ్లిపోయారు. మరోవైపు బంధువులు ఆస్తుల కోసం ఆరా తీయడం కూడా శశికళకు చికాకు తెప్పించినట్లు తెలుస్తోంది.

ఒంటరిగా ఉండేందుకే…..

శశికళ ఇటీవల కాలంలో కేవలం నటరాజన్ ఒక్కరితోనే మాట్లాడినట్లు తెలుస్తోంది. శశికళ సమీప బంధువులను కూడా ఆమె కలిసేందుకు ఇష్టపడటం లేదు. కనీసం ఒకే గదిలో తన వదిన ఇళవరిసితో కూడా ఉండటానికి ఇష్టపడటం లేదన్నది జైలు అధికారుల వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. అందుకోసం ఆమె తనకు ప్రత్యేక గదిని కేటాయించాలని ఇటీవల జైలు అధకారులను కోరారు. శశికళ విజ్ఞప్తిని పరిశీలించిన జైలు అధికారులు ఆమెకు ప్రత్యేక గదిని కేటాయించారు. జైలు అధికారులు ఇచ్చే భోజనం కూడా శశికళ సరిగా తీసుకోవడం లేదు. దీంతో ఇటీవల ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తినట్లు సమాచారం. జైలులోకి రాగానే తనకు ప్రత్యేకంగా ఏసీ గది కావాలని, ఒక అటెండెంట్, ఇంటి నుంచి భోజనం కావాలని శశికళ న్యాయస్థానాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే శశికళ పిటీషన్ ను కోర్టు కొట్టేయడంతో ఆమె సాధారణ ఖైదీలాగానే జైలు జీవితం గడుపుతున్నారు. తమిళ పేపర్లు మాత్రం ఆసక్తిగా చదువుతున్నట్లు జైలు అధికారులు చెప్పారు. మొత్తం మీద శశికళ అందరూ ఉన్నా…ఒంటరై పోయారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 37162 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*