సూపర్ స్టార్ పునరాలోచనలో పడ్డారా?

రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు కాని ఆయన రావద్దనే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రజనీకాంత్ డిసెంబర్ 12వ తేదీన పార్టీని ప్రకటిస్తారని అందరూ చెబుతున్నారు. అయితే పార్టీ పెట్టక ముందే రజనీకాంత్ కు అనేక మంది సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రాజకీయాలు రజనీ ఒంటికి పడవని, ఆయన మనస్తత్వానికి సరిపోవని అంటున్నారు. ఇదే విషయాన్ని బిగ్ బి అమితాబ్ కూడా రజనీకి వివరించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో మనలాంటి వాళ్లం పనికిరామని బిగ్ బీ చెప్పారట. అంతేకాదు చిరంజీని ప్రజారాజ్యాన్ని కూడా ఇందుకు ఉదహరించారు. దీంతో రజనీకాంత్ పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. సన్నిహితులే కాకుండా కుటుంబసభ్యులు కూడా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై అయిష్టత చూపుతున్నారు. రజనీ ఆరోగ్యం దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మేలంటున్నారు.

రాజకీయాలు వద్దే వద్దు….

రజనీకాంత్ ఆరోగ్య సమస్యలు తరచూ తలెత్తుతుండటంతో ఆయన అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. త్వరలోనే మరోసారి ఆయన అమెరికాకు ఆరోగ్యపరీక్షల నిమిత్తం వెళ్లనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో కి దిగితే రేయింబవళ్లూ తిరగాల్సి ఉంటుంది. శారరీక అలసటతో పాటు మానసిక ప్రశాంతత కూడా ఉండదని కుటుంబసభ్యులు రజనీకాంత్ కు నచ్చచెబుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ కు మీడియాలో తప్ప రాజకీయాల్లో పట్టు లేదని సినీనటుడు రాజేందర్ ఆరోపించారు. జీఎస్టీ దెబ్బతో సినిమారంగం కుదేలైపోతున్నా రజనీకి పట్టదా? అని రాజేందర్ ప్రశ్నించారు. తనకు అన్నీ ఇచ్చిన సినీరంగానికి జీఎస్టీ రూపంలో నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం రజనీ నైజానికి నిదర్శనమని దెప్పిపొడిచారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోవడమే మంచిదని రాజేందర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కూడా ఇదే తరహాలో సలహా ఇచ్చారు. దీంతో రజనీని రాజకీయాల్లోకి రావద్దంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం…కుటుంబసభ్యుల వత్తిడితో ఆయన రాజకీయ ప్రవేశంపై పునరాలోచనలో పడ్డారు.

Ravi Batchali
About Ravi Batchali 20612 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*